Credit score: మీ పెళ్లికి, సిబిల్ స్కోర్‌కి లింకేంటి? పెళ్లి చేసుకుంటే స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
వివాహం అనేది నేరుగా మీ క్రెడిట్ స్కోర్ పై నేరుగా ప్రభావం చూపదు. మీ పార్టనర్‌తో జాయింట్ బ్యాంకు ఖాతా, యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు వినియోగం వంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించనప్పుడే సానుకూల, లేదా ప్రతికూలా ప్రభావం చూపుతుంది. అప్పుడు సిబిల్ స్కోర్లో మార్పులు సంభవిస్తాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా చెప్పవచ్చు. జీవితంలో అనేక రకాలుగా అది ఉపయోగపడుతుంది. మీరు వ్యాపారం చేయాలన్నా, ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయాలన్నా, వ్యక్తిగత అవసరాల కోసమైనా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలన్నా ఇదే కీలకం. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే వెంటనే రుణం మంజూరవుతుది. అది కూడా తక్కువ వడ్డీకి ఎక్కువ మెత్తంలో రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే క్రెడిట్ స్కోర్ బాగా లేకుంటే వడ్డీ ఎక్కువగా విధిస్తారు. ఒక్కోసారి రుణాన్ని కూడా తిరస్కరించే ప్రమాదం ఉంది. అయితే కొన్ని జాయింట్ ఖాతాల వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
భాగస్వామి రాకతో..
పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ అత్యవసరం. జీవిత భాగస్వామి వచ్చినప్పుడు కొన్ని మార్పులు సంభవిస్తాయి. అప్పటి వరకూ ఎంతో బాగున్న మీ క్రెడిట్ స్కోర్‌పై కొన్ని అంశాలు ప్రభావం చూపిస్తాయి. మీరు మీ భాగస్వామితో జాయింట్ ఖాతా తెరవాలని కోరుకున్నప్పుడు, మీ క్రెడిట్ కార్డును వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ బిల్లులను ఎల్లప్పుడూ సకాలంలో చెల్లించేవాడు. అతడి క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. ఆ వ్యక్తికి ఒక అమ్యాయితో పెళ్లి జరిగిన తర్వాత ఆమెకు ఒక యాడ్-ఆన్ కార్డ్‌ను ఇచ్చాడు. అయితే ఆమె తన క్రెడిట్ కార్డ్ బిల్లులను సక్రమంగా క్లియర్ చేయలేదు. అయితే ఆ కార్డు ఆ అమ్మాయి పేరుతో కాకుండా ఆ వ్యక్తి పేరు మీద జారీ చేసినందున, అతడి క్రెడిట్ స్కోర్‌పై నెగిటివ్ ప్రభావం చూపింది. మరి ఇలాంటి సందర్భంలో క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
ప్రభావితం చేసే అంశాలివే..
- మీరు మీ జీవిత భాగస్వామితో జాయింట్ ఖాతాను తెరవాలని, రుణం కోసం సహ సంతకం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్లు జాయింట్ ఖాతాల కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. ఆలస్య చెల్లింపులు, ఉమ్మడి ఖాతాలపై అధిక నిల్వలు భార్యాభర్తల క్రెడిట్ స్కోర్‌లకు ప్రతికూలంగా మారతాయి.
- మీ క్రెడిట్ కార్డులో వినియోగదారుగా మీ జీవిత భాగస్వామి పేరును జోడించడం వల్ల మీ ఇద్దరి క్రెడిట్ స్కోర్లలో మార్పులు జరుగుతాయి.
- ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి క్రెడిట్ స్కోర్ చాలా ప్రధానం. వారికి ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు మీరు జాయింట్ అకౌంట్ హోల్డర్‌గా మారితే అది మీ క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీ జీవిత భాగస్వామికి తక్కువ క్రెడిట్ స్కోర్, ఆర్థిక సమస్యల చరిత్ర ఉంటే మీకు కూడా ఇబ్బందిగా మారుతుంది.
- జీవిత భాగస్వామితో కలిసి సమర్ధంగా బడ్జెట్‌ను రూపొందించుకుని, సమయానికి బిల్లులను క్లియర్ చేసి, అప్పులు లేకుండా చూసుకుంటే అది మీ ఇద్దరికీ మంచి చేస్తుంది. కాబట్టి క్రెడిట్, అప్పు, ఆర్థిక లక్ష్యాల విషయాలను మీ భాగస్వామితో ఎప్పటికప్పుడు చర్చించుకోవడం చాలా ముఖ్యం.
- వివాహం అనేది నేరుగా మీ క్రెడిట్ స్కోర్ పై నేరుగా ప్రభావం చూపదు. మీ పార్టనర్‌తో జాయింట్ బ్యాంకు ఖాతా వంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించనప్పుడే సానుకూల, లేదా ప్రతికూలా ప్రభావం చూపుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..