ప్రియుడితో నవ వధువు పరార్.. భర్త, పెళ్లి పెద్ద ఆత్మహత్య!
ఓ యువకుడికి మూడు నెలల కిందట వివాహం జరిగింది. అయితే, తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉన్నట్టు పెళ్లికి ముందే అతడికి తెలిసింది. అయినా వివాహం తర్వాతైనా పద్ధతి మార్చుకుంటుందని అతడు భావించాడు. కానీ, తీరు మార్చుకోని సదరు భార్య.. ప్రియుడితో పారిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి, ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరించిన భార్య బావ కూడా విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. కర్ణాటకలో జరిగిన ఈ విషాద ఘటనలో, భార్యపై భర్త సూసైడ్ నోట్ లో ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దాంతో సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేసారు.
దావణగెరి జిల్లా గుమ్మనూర్ గ్రామానికి చెందిన హరీష్ కు.. హులికొట్టే గ్రామానికి చెందిన సరస్వతితో మూడు నెలల కిందట వివాహం జరిగింది. ఈ పెళ్లి సంబంధాన్ని సరస్వతి బావ రుద్రేష్ తీసుకొచ్చారు. జనవరి 23న గుడికి అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సరస్వతి తిరిగి రాలేదు. దీంతో హరీష్, అతడి కుటుంబం ఆందోళన చెందారు. సరస్వతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో చేయడంతో మిస్సింగ్ ఫైల్ అయింది. ఆమె శివకుమార్ అనే వ్యక్తితో ఉన్నట్టు గుర్తించారు. పెళ్లికి ముందు శివకుమార్‌ను ప్రేమించిన సరస్వతి.. తన ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో భార్య వెళ్లిపోయిందని మనస్థాపానికి గురైన భర్త హరీష్.. సోమవారం ఉరేసుకున్నాడు. భార్య సరస్వతి తాను వేధిస్తున్నట్టు తప్పుడు ఆరోపణలు చేసిందని, ఆమె బంధువులు తనను బెదిరించారని, తన చావుకే కారణం ఆమేనని హరీష్ సూసైడ్ నోట్‌లో రాసాడు.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

