కేదార్‌నాథ్‌లో పాత కాలిబాట మార్గం ఓపెన్.. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ.. !
కేదార్‌నాథ్ కు వెళ్లే భక్తులకు, ఈ సీజన్ నుంచి ఉపశమనం కలగనుంది. పాత కాలిబాట పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. 13 ఏళ్ల తర్వాత ఆ మార్గం తిరిగి అందుబాటులోకి రావడం పై భక్తులు సంతోషం వ్యక్తం చేసారు. 2013 జూన్‌లో కేదార్‌నాథ్ వరదల్లో ఆ కాలిబాట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో యాత్రికులు ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం గుప్తకాశీ పబ్లిక్ వర్క్స్ శాఖ ఆ మార్గాన్ని దశలవారీగా పునర్నిర్మించింది. మొదట కేదార్‌నాథ్ నుంచి గరుడచట్టి వరకు ఉన్న 3.3 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత, తీవ్రంగా దెబ్బతిన్న గరుడచట్టి నుంచి రాంబారా 5.3 కిలోమీటర్ల సెక్షన్‌ను కూడా పూర్తి చేశారు.
బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకోవడానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి ప్రయాణం సులభంగా, సురక్షితంగా ఉండేలా పాత కేదార్‌నాథ్ మార్గంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మార్గం వెంబడి తాగునీరు, వర్షం నుంచి రక్షణ కల్పించే షెడ్లు, రైలింగ్‌లు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భక్తులు ప్రతికూల వాతావరణంలోనూ సౌకర్యవంతంగా ఉండేందుకు వీలవుతుంది. కేదార్ నాథ్ ఆలయాన్ని చేరుకునేందుకు, భక్తులకు ఈ సీజన్ నుంచి రెండు మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి పునర్నిర్మించిన గౌరీకుండ్-రాంబారా-గరుడచట్టి-కేదార్‌నాథ్ మార్గం కాగా, రెండోది ప్రస్తుతం అందుబాటులో ఉన్న గౌరీకుండ్-రాంబారా-లించౌలి మార్గం. అయితే, రాంబారా నుంచి కేదార్‌నాథ్ దూరం గతంలో 7 కిలోమీటర్లు ఉండేదని, కొన్ని మార్పుల కారణంగా అది ఇప్పుడు 8.6 కిలోమీటర్లకు పెరిగింది.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
పాత స్మార్ట్ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. చివరికి ఇలా
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..
గ్రామ సర్పంచ్ ఇంటిముందు క్షుద్రపూజలు
స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ..

