AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..

టీలో అల్లం కలుపుకోవడం మనకు తెలుసు.. కానీ ఇప్పుడు కాఫీలో అల్లం కలుపుకుని తాగే సరికొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. బరువు తగ్గాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా జింజర్ కాఫీ బెస్ట్ అని చాలా మంది ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ వెరైటీ కాంబినేషన్ నిజంగానే కొవ్వును కరిగిస్తుందా? లేక లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందా? తెలుసుకుందాం..

కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
Ginger Coffee For Weight Loss
Krishna S
|

Updated on: Feb 05, 2026 | 2:05 PM

Share

ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న కొద్దీ, పాత పద్ధతులకు కొత్త మెరుగులు దిద్దుతున్నారు నేటి జనం. టీలో అల్లం కలుపుకోవడం మనకు తెలిసిందే.. కానీ ఇప్పుడు అల్లం కాఫీ సరికొత్త వెయిట్ లాస్ మంత్రంగా మారుతోంది. జీవక్రియను వేగవంతం చేయడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఈ కాంబినేషన్ అద్భుతాలు చేస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే దీని వల్ల లాభాలు ఎంత ఉన్నాయో, కొన్ని నష్టాలు కూడా అంతే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అల్లం కాఫీ: అసలు ప్రయోజనాలు ఏంటి?

మెటబాలిజం బూస్టర్

అల్లంలో సహజమైన థర్మోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచి, కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడతాయి. కాఫీలోని కెఫిన్ కూడా మెటబాలిజంను పెంచుతుంది కాబట్టి ఈ రెండింటి కలయిక బరువు తగ్గాలనుకునే వారికి ఒక వరంగా మారుతోంది.

ఆకలి నియంత్రణ

కాఫీ, అల్లం కలిపి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది అనవసరమైన చిరుతిళ్లు తినకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా వ్యాయామానికి ముందు దీన్ని తాగడం వల్ల శక్తి స్థాయిలు పెరిగి, ఎక్కువ సేపు వ్యాయామం చేసే సత్తువ లభిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల

అల్లం వల్ల గ్యాస్, ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా శరీరంలో కొవ్వు నిల్వలు పెరగకుండా ఇది చూస్తుంది.

అందరికీ ఇది మంచిది కాదా?

ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అతిగా తాగితే ముప్పేనని వైద్యులు చెబుతున్నారు.

యాసిడ్ రిఫ్లక్స్: కాఫీ, అల్లం రెండూ శరీరంపై వేడి ప్రభావాన్ని చూపుతాయి. అల్సర్, అసిడిటీ లేదా గుండెల్లో మంట ఉన్నవారికి ఈ పానీయం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

నిద్రలేమి: కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. రాత్రి వేళల్లో ఇది తాగితే ఆందోళన, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.

హృదయ స్పందన: అతిగా తీసుకుంటే హృదయ స్పందన వేగవంతం అయ్యే ప్రమాదం ఉంది.

నిపుణుల సలహా

  • రోజుకు 1 లేదా 2 కప్పుల కంటే ఎక్కువ అల్లం కాఫీ తాగకూడదు.
  • బరువు తగ్గడం కోసం తాగేవారు ఇందులో చక్కెర, క్రీమ్ లేదా ఇతర ఫ్లేవర్లను వాడకపోవడమే మంచిది.
  • గర్భిణీలు, అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీన్ని తీసుకోవాలి.

కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
భలే ఛాన్స్.. జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు
భలే ఛాన్స్.. జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు
ఇల్లు చూడాలంటే నెల అద్దె కట్టాలా.. బెంగళూరులో సెక్యూరిటీ గార్డు..
ఇల్లు చూడాలంటే నెల అద్దె కట్టాలా.. బెంగళూరులో సెక్యూరిటీ గార్డు..
భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.!
భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.!
ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది
ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది