AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు

టీవీ9 స్టింగ్‌ ఆపరేషన్‌తో ఏపీలో జంతు ఆయిల్‌ దందా బయటపడుతోంది. నిన్న ఏలూరులో జంతు ఆయిల్‌ మాఫియాను బయటపెట్టిన టీవీ9.. ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ రహస్యంగా నడుస్తోన్న యానియల్‌ ఆయిల్‌ దందాను వెలుగులోకి తీసుకొచ్చింది. కంప్లీట్‌ డిటైల్స్‌ చూద్దాం. ఆ వివరాలు ఇలా..

Andhra: బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
Adulterated Cooking Oil
M Sivakumar
| Edited By: |

Updated on: Feb 05, 2026 | 5:03 PM

Share

మంగళగిరిలోనూ జంతు కళేబరాల వంట నూనె‌ కలకలం రేపింది. టీవీ9 నిఘాలో జంతువుల వంట నూనె దందా బయటపడింది. 15 కేజీల జంతు ఆయిల్‌ రూ.1500కి ముఠా అమ్ముతోంది. రెండు రకాలుగా జంతు కళేబరాల వంట ఆయిల్‌ తయారీ చేస్తున్నారు. చచ్చిన జంతువుల కళేబరాలతో ఒకరకమైన వంట ఆయిల్‌.. మాంసం కోసం చంపిన జంతువుల వ్యర్థాలతో మరో ఆయిల్‌ ఉంది. జంతు కొవ్వు, ఎముకలతో ఆయిల్‌ ముఠా తయారు చేస్తోంది.  బిర్యానీలు, నూడిల్స్‌లో ఎక్కువగా వాడుతున్నారంటున్న తయారీదారులు.. ఇళ్ల దగ్గరే తయారుచేసి రహస్యంగా ముఠా అమ్ముతోంది. హోటల్స్‌ వాళ్లు ఎక్కువగా తీసుకెళ్తారంటున్నారు తయారీదారులు.

ఏదో కుటీర పరిశ్రమ అన్నట్టుగా ఇళ్ల దగ్గరే ఈ జంతు ఆయిల్‌ను తయారు చేస్తున్నారు. జంతు కళేబరాలు, కొవ్వుతో ఆయిల్‌ తీస్తున్నారు. ఇళ్ల ముందే పెద్దపెద్ద పాత్రల్లో జంతు వ్యర్థాలను ఉడికిస్తూ యానిమల్‌ వంటనూనె తయారు చేస్తున్నారు. మంగళగిరిలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోన్న జంతు ఆయిల్‌ దందాపై టీవీ9 స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. జంతు కళేబరాల వంట నూనె‌ను ఎలా అమ్ముతున్నారో చూడండి. యానిమల్‌ ఆయిల్‌ను రెండు రకాలుగా తయారుచేస్తోంది ముఠా. చచ్చిన జంతువుల కళేబరాలతో ఒకరకమైన ఆయిల్‌.. మాంసం కోసం చంపిన జంతువుల వ్యర్థాలతో మరో ఆయిల్‌ తయారు చేస్తున్నారు. ఈ రెండు ఆయిల్స్‌ కలర్స్‌లో భారీ తేడాలు ఉంటాయి. మొదటిది చిక్కగా థిక్‌ కలర్‌లో ఉంటే.. రెండోది అచ్చం రెగ్యులర్‌ ఆయిల్స్‌ మాదిరిగానే ఉంటుందంటున్నారు తయారీదారులు. యానిమల్‌ ఆయిల్‌ దందా సీక్రెట్‌గా చేస్తారంటోంది ఓ మహిళ. ఎక్కడెక్కడ.. ఎవరు అమ్ముతున్నారో క్లారిటీగా చెప్పింది.

వీడియో చూడండి..

Follow Us
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే