AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salary Slip: గ్రాస్ శాలరీ VS నెట్ శాలరీ.. శాలరీ స్లిప్ చూసి షాక్ అవుతున్నారా..? జీతం పొందే ప్రతీఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోండి

కొంతమంది ఉద్యోగులకు శాలరీ స్లిప్‌లోని విషయాలు అర్ధం కావు. గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ మధ్య తేడాలు తెలియక గందరగోళానికి గురవుతారు. ఆఫ్ లెటర్‌లో రాసిన జీతం వివరాలు, శాలరీ స్లిప్‌లో ఉన్న వివరాలు వేర్వురుగా ఉండటం వల్ల కన్‌ప్యూజ్ అవుతారు.

Salary Slip: గ్రాస్ శాలరీ VS నెట్ శాలరీ.. శాలరీ స్లిప్ చూసి షాక్ అవుతున్నారా..? జీతం పొందే ప్రతీఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోండి
Payslip
Venkatrao Lella
|

Updated on: Feb 05, 2026 | 11:26 AM

Share

ఉద్యోగం చేసే ప్రతీఒక్కరికీ జీతం విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. పే స్లిప్‌లో పొందుపర్చే చాలా వివరాలు అర్థం కాక కన్‌ప్యూజన్‌ చెందుతారు. ఏ కంపెనీ అందించే ప్లే సిప్‌లో అయినా గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ అని ముద్రించి ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటనే విషయం తెలియక శాలరీ తక్కువ వచ్చిందని ఆందోళన పడుతుంటారు. ఉద్యోగంలో చేరేటప్పుడు మీకు అందించే ఆఫ్ లెటర్‌లో పొందుపర్చే జీతం వివరాలు, ఆ తర్వాత శాలరీ స్లిప్‌లో ఉండే వివరాల మధ్య తేడాలు ఉంటాయి. దీంతో జీతం తక్కువగా జమ అయిందని చాలామంది అనుమానపడుతుంటారు. దీంతో జీతం పొందే ప్రతీఒక్కరూ గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ మధ్య తేడా తెలుసుకోవడం ద్వారా ఆ అనుమానల నుంచి బయటపడవచ్చు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటనే విషయం ఇందులో చూద్దాం.

గ్రాస్ శాలరీ అంటే..?

మీరు శాలరీ స్లిప్‌లో గ్రాస్ శాలరీ అని నమోదు చేసి ఉంటుంది. అంటే ట్యాక్సులు, పీఎఫ్, మినిమం శాలరీ, హోమ్ రెంట్ అలవెన్స్(HRA), ట్రావెల్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లు అన్నీ కలిపితే వచ్చే మొత్తాన్ని గ్రాస్ శాలరీగా పరిగణిస్తారు. అంటే కటింగ్స్‌ అన్ని కలిపి మీకు  అందించే మొత్తం.

ఇక నెట్ లేదా టేక్ హోం శాలరీ

ఇక నెట్ లేదా టేక్ హోం శాలరీ అంటే మీ బ్యాంక్ అకౌంట్లో కంపెనీ నెలనెలా జమ చేసే జీతం. ప్రావిడెంట్ ఫండ్, టీడీఎస్, ప్రొఫెషనల్ ట్యాక్స్, మెడిక్లెయిమ్, ఇతర తగ్గింపులు చేసిన తర్వాత కంపెనీ మీ అకౌంట్లో జమ చేసే మొత్తం.

తగ్గింపులు ఎలా అంటే..?

-ఉద్యోగి బేసిక్ శాలరీలో 12 శాతంను పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది

-ఉద్యోగి పన్ను శ్లాబు ప్రకారం జీతంలో ప్రతీ నెలా కొంత మొత్తంలో టీడీఎస్ రూపంలో కట్ చేసి ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెల్లిస్తుంది

-ఇక ఉద్యోగి మొత్తం జీతంలో కొంత నగదు గ్రాట్యుటీ క్రింద కట్ చేస్తుంది. ఉద్యోగం నుంచి వదిలి వెళ్లేటప్పుడు వీటిని తిరిగి ఇచ్చేస్తుంది

-ఇక రాష్ట్రాలు విధించే ప్రొఫెషనల్ ట్యాక్స్‌ను రూ.200 నుంచి రూ.300 మధ్య జీతంలో కట్ చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది

-ఇక కంపెనీ అందించే హెల్త్ ఇన్యూరెన్స్, ఇతర పాలసీలకు జీతం నుంచి కొంత మొత్తంలో కట్ చేస్తారు

-ఈ తగ్గింపుల తర్వాత వచ్చే శాలరీని నెట్ శాలరీగా పిలుస్తారు. ఈ మొత్తం మీకు జీతం రూపంలో నెలనెలా అందిస్తారు