Online Nomination: అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఇక ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్ వేయొచ్చు
దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ ముగిసిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. అయితే ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సరికొత్త టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఓటరు నమోదు, నేతల ప్రచార సభలు, సమావేశాల అనుమతుల
దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ ముగిసిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. అయితే ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సరికొత్త టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఓటరు నమోదు, నేతల ప్రచార సభలు, సమావేశాల అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపట్టింది ఈసీ. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఇంటి నుంచే నామినేషన్ పత్రాలను దాఖలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందు కోసం ఎన్నికల కమిషన్ suvidha.eci.gov.in యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి ఈ నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేరుగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడం లేదా ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు వెసులుబాటు ఉంది. ఈ ఎన్నికల కమిషన్ రూపొందించిన యాప్‌లో కమిషన్ సూచించిన వివరాలు నమోదు చేసి ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థికి చెందిన ఆస్తుల వివరాలు, అఫిడవిట్ డాక్యుమెంట్లు, నామినేషన్ బలపర్చిన తర్వాత పది మంది వివరాలను కూడా నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత వాటిని ప్రింట్ తీసి నామినేషన్ దాఖలుకు గడువులోగా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో సమర్పించిన పత్రాలతో మూడు సెట్లు జిల్లా ఎన్నికల అధికారిని కలిసి అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన, ఎన్నికల గుర్తుల కేటాయింపు సమయంలో అభ్యర్థులు అందుబాటులో లేకుంటే వారి మద్దతుదారులు హాజరుకావచ్చని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి