AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన పిలిస్తేనే ఈవెంట్‌కు వెళ్ళా..! చంద్రహాస్ పాట వివాదంపై స్పందించిన ఆది సాయి కుమార్

నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా అడుగుపెట్టి సినిమాలు చేస్తున్నాడు చంద్రహాస్. ప్రస్తుతం బారా బర్ ప్రేమిస్తా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ స్టేజ్ పై ఓ పాట పాడాడు. ఆ పాట వివాదంగా మారింది. ఈ పాటలో అతను బూతులు వాడటంతో దుమారం రేగింది.

ఆయన పిలిస్తేనే ఈవెంట్‌కు వెళ్ళా..! చంద్రహాస్ పాట వివాదంపై స్పందించిన ఆది సాయి కుమార్
Chandrahass
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2026 | 3:07 PM

Share

చంద్రహాస్.. ఇప్పుడు ఇతని పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు కానీ ఇండస్ట్రీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ప్రముఖ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్.. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు హిట్ చూడని చంద్రహాస్ ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ కాస్త అత్యుత్సహం చూపించాడు. స్టేజ్ ఎక్కి ఓ పాట పాడాడు. ఆ పాటలో వాడకూడని పదాలు వాడాడు. అందరి ముందు పాట పడుతూ బూతులు వాడాడు. దాంతో అతని పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు నెటిజన్స్.

రోత పుట్టించేలా పాట పాడటమే కాదు.. అందులో బూతులు వాడటంతో వివాదం రేగింది. దీనిపై చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు. ఈ ఈ వివాదం పై చంద్రహాస్ కూడా స్పందించాడు. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసే వాళ్లు బాగా ఎంజాయ్ చేయండి. అలాగని నచ్చని వాళ్లకు మాత్రం క్షమాపణలు చెప్పను. మీ మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయా? అలా చూస్తే నా మనోభావాలు ఎప్పుడో దెబ్బతిన్నాయి. చాలా సార్లు సార్లు నన్ను ట్రోల్ చేశారు. నన్ను కూడా తిట్టారు. అంటూ ఓ వీడియో వదిలాడు.

ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లుగా హాజరైన జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్ కూడా దీని పై స్పందించారు. జేడీ మాట్లాడుతూ.. అతను ఆ పాట పాడే సమయంలో నేను షాక్ అయ్యాను. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సింది అంటూ జేడీ చెప్పుకుకొచ్చాడు. ఇక ఆది సాయి కుమార్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ షేర్ చేశారు. ప్రభాకర్ ఆహ్వానం మేరకే ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళాను. పాట వివాదాన్ని నేను ఊహించలేదు. ఎంతోమందిని ప్రభావితం చేసే అలాంటి ఈవెంట్లలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది అంటూ ఆది రాసుకొచ్చారు. ఇక ఇప్పటికే చంద్రహాస్ పై పోలీస్ కేసు కూడా నమోదైంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..