Whatsapp: యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం.. యాపిల్‌ స్టోర్‌ నుంచి తొలగింపు.. కారణం ఏంటో తెలుసా?

వాట్సాప్‌.. దీని పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. చాటింగ్స్‌, స్టేటల్‌, గ్రూప్‌ చాటింగ్‌ ఇలా ఒక్కటేమిటి వాట్సాప్‌లో చాలా సదుపాయాలున్నాయి. వాట్సాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ ఫోన్‌ అంటూ ఉండదేమో. పిల్లల నుంచి పెద్దల వరకు వాట్సాప్‌ ఉపయోగిస్తూనే ఉంటారు. వాట్సాప్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది..

Whatsapp: యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం.. యాపిల్‌ స్టోర్‌ నుంచి తొలగింపు.. కారణం ఏంటో తెలుసా?
Whatsapp
Follow us

|

Updated on: Apr 19, 2024 | 5:09 PM

వాట్సాప్‌.. దీని పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. చాటింగ్స్‌, స్టేటల్‌, గ్రూప్‌ చాటింగ్‌ ఇలా ఒక్కటేమిటి వాట్సాప్‌లో చాలా సదుపాయాలున్నాయి. వాట్సాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ ఫోన్‌ అంటూ ఉండదేమో. పిల్లల నుంచి పెద్దల వరకు వాట్సాప్‌ ఉపయోగిస్తూనే ఉంటారు. వాట్సాప్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌ సంస్థ కూడా కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ఈ దేశంలో వాట్సాప్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ముఖ్యంగా యాపిల్‌ స్టోర్‌ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది భారతదేశంలో కాదు.. చైనాలో.

చైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు యాపిల్ తన చైనా యాప్ స్టోర్ నుంచి వాట్సాప్, థ్రెడ్స్ యాప్‌లను తొలగించింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వాట్సాప్, థ్రెడ్‌లను చైనా నిషేధించింది. అందువల్ల ఇది యాపిల్‌ యాప్ స్టోర్ నుండి తీసివేసింది. ఇది చైనాలో మాత్రమే వర్తిస్తుంది. భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులకు వారి యాప్ స్టోర్‌లో వాట్సాప్ అందుబాటులో ఉంటుంది. మేము పనిచేసే దేశాల్లోని చట్టాల గురించి విభేదించినప్పటికీ, వాటిని పాటించడం మా కర్తవ్యం. చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ యాప్‌లను స్టోర్ నుండి తొలగించాలని ఆదేశించింది. ఎందుకంటే జాతీయ భద్రత ప్రమాదం ఉంది,’ అని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది, బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ ప్రకారం.. చైనీస్ స్టోర్ ఫ్రంట్ నుండి WhatsApp, Thread యాప్‌లు మాత్రమే తొలగించింది. ఈ యాప్‌లు ఇతర స్టోర్ ఫ్రంట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయని ఆపిల్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

అదే భద్రతా ప్రమాదం కారణంగా ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం X యాప్‌ను నిషేధించింది. చైనాలో కూడా ట్విట్టర్, ఫేస్‌బుక్ పని చేయడం లేదు. 2021లో టిక్‌టాక్‌తో సహా పలు యాప్‌లను భారత్ నిషేధించింది. ఇలాంటి కొన్ని సోషల్ మీడియా యాప్‌లు వివిధ దేశాల్లో నిషేధించబడ్డాయి. WhatsApp మరియు Thread రెండూ మెటా ప్లాట్‌ఫారమ్‌లకు చెందిన అప్లికేషన్‌లు. X యాప్‌కి పోటీదారుగా థ్రెడ్ రూపొందించబడింది. చైనాలో సోషల్ మీడియాపై ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల సమాచారం కళ్లలోకి రాకుండా అక్కడి ప్రభుత్వం వీలైనంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా, చైనా ప్రభుత్వం రాజకీయంగా సున్నితమైన సమాచారాన్ని పరిమితం చేస్తుంది.

యాపిల్‌కు చైనా చాలా ముఖ్యమైన దేశం. అమెరికాతో పాటు దీనికి అతిపెద్ద మార్కెట్ చైనా. దాని ఐఫోన్, ఇతర ఉత్పత్తులు చాలా వరకు చైనాలో తయారు చేయబడ్డాయి. ఈ కారణంగా ఆపిల్ చైనా ప్రభుత్వ ఆదేశాలను పాటించవలసి ఉంటుంది. లేదంటే యాపిల్ నే చైనా బ్యాన్ చేసే అవకాశం ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..