- Telugu News Photo Gallery Technology photos Best deals on laptops in amazon sale, check details in telugu
Amazon sale: ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీల ల్యాప్ టాప్ లను దాదాపు 50 శాతం తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. డెల్, హెచ్‌పీ తదితర టాప్ మోడళ్లనూ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. కళ్లకు ఇబ్బంది కలగకుండా యాంటీ గ్లేర్ స్క్రీన్, మంచి స్టోరేజ్ కెపాసిటీ, విశాలమైన స్క్రీన్ సైజ్ తదితర ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్ సేల్‌లో లభిస్తున్న వీటి వివరాలు తెలుసుకుందాం.
Madhu |
Updated on: Apr 19, 2024 | 5:34 PM

హెచ్‌పీ ల్యాప్ టాప్ 15ఎస్(HP laptop 15s, 12th gen intel core i3).. ఈ ల్యాప్ టాప్ లో 15ఎస్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ కారణంగా పనితీరు వేగవంతంగా ఉంటుంది. బ్లూటూత్, వైఫైతో సునాయాసంగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలోని యాంటీ గ్లేర్ స్క్రీన్ మీ కళ్లను హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తుంది. కేవలం 45 నిమిషాల్లో 50 శాతం వరకూ చార్జింగ్ చేసుకునే వీలుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, డ్యూయల్ స్పీకర్లు తదితర ఫీచర్లు కలిగిన ఈ ల్యాప్ టాప్ రూ. 37,290కు అందుబాటులో ఉంది.

యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్(Apple MacBook Air laptop M1 chip).. ఈ ల్యాప్ టాప్లో ఎం1 చిప్, మ్యాక్ ఓఎస్ 10.14 మోజావే ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆకట్టుకునే రెండు రకాల రంగులలో లభిస్తుంది. దీనిలోని 13.3 అంగుళాల రెటీనా డిస్ ప్లే తో స్పష్టంగా చూడటానికి వీలుంటుంది. స్లిమ్, స్లైలిష్ లుక్ తో ఆకర్షణీయంగా ఉంటుంది. హెచ్ డీ కెమెరా నాణ్యత, మెరుగైన వీడియో కాలింగ్ దీని ప్రత్యేకతలు. డిజైనర్లు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్ టాప్ ధర రూ. 76,990.

డెల్ జీ15-5530(Dell G15-5530 Gaming Laptop).. గేమింగ్ కోసం ఈ ల్యాప్ టాప్ ఎంతో ఉపయోగపడుతుంది. 16 జీబీ ర్యామ్ కారణంగా మంచి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అన్ని ఫైల్, గేమ్‌లను సులభంగా సేవ్ చేసుకోవడానికి సహకరిస్తుంది. 13వ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ తో 4.60 జీహెచ్ జెడ్ వేగంతో పనిచేస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్ కారణంగా మసక వెలుతురులో కూడా ఆపరేట్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో అనేక కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. ఈ డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 79,990.

అసుస్ క్రియేటర్ సిరీస్ వివోబుక్(ASUS creator series Vivobook 16X 2023).. మెరుగైన ఫీచర్లు, రెండు ఆకర్షణీయమైన రంగులలో ఈ ల్యాప్ టాప్ లభిస్తుంది. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 2.6 జీహెచ్ జెడ్ వేగంతో ఈ పనిని ఎంతో వేగంతో చేస్తుంది. రిఫ్రెష్ రేట్ 120 హెచ్ జెడ్, ఐస్ కూల్ థర్మల్ టెక్నాలజీతో గంటల తరబడి పనిచేసిన తర్వాత కూడా చల్లగా ఉంటుంది. రెండు యూఎస్ బీ 3.2 జెన్ 1 టైప్ ఏ పోర్ట్‌లు, ఎక్స్టర్నల్ మానిటర్లను కనెక్ట్ చేయడానికి హెచ్ డీఎంఐ 2.1 పోర్ట్, ఎస్ డీ కార్డ్ రీడర్, ఆడియో కాంబో జాక్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ రూ.75,990కు అందుబాటులో ఉంది.

ఎంఎస్ఐ జీఎఫ్63(MSI GF63 Thin, intel core i5) ఆఫీసు వర్స్, గేమింగ్ రెండింటికీ ఈ ల్యాప్ టాప్ చక్కగా సరిపోతుంది. ఇంటెల్ కోర్ ఐ5తో మల్టీ టాస్క్‌లను సమర్ధంగా చేసుకోవచ్చు. 8 జీబీ నిల్వ సామర్థ్యంతో, 40 సెంటీమీటర్ల స్క్రీన్ తో ఎంతో ఆకట్టుకుంటుంది. నాణ్యమైన, మన్నికైనా ఈ ల్యాప్ టాప్ ఎక్కువకాలం పనిచేస్తుంది. దీని ధర రూ. 43,990. తక్కువ ధరకు లభించే ఉత్తమ ఫీచర్లు ఉన్న ల్యాప్ టాప్ ఇది.





























