- Telugu News Photo Gallery Technology photos Samsung launches new variant in Galaxy F15 5G smart phone check here for full details
Galaxy F15 5G: రూ. 12వేలకే సామ్‌సంగ్ 5జీ ఫోన్.. ఫీచర్స్ కూడా సూపర్
ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ సైతం తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది..
Updated on: Apr 20, 2024 | 8:44 AM

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్15 పేరుతో బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ ఫోన్‌కు కొత్త ర్యామ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాలక్సీ ఎఫ్15 5జీ స్మార్ట్ ఫోన్ కొత్తగా తీసుకొచ్చిన వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 15,999కాగా ఇంతకుముందు తీసుకొచ్చిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ రూ.12,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999గా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఈ ఫోన్‌లపై రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఈ ఫోన్ సొంతం.

ఇక ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన 6.5 ఇంచెస్‌తో ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లేను అందించారు.

25 వాట్స్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.





























