AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC CSE Notification 2026: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దాదాపు 933 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 నోటిఫికేషన్‌ను..

UPSC CSE Notification 2026: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
UPSC Civil Services Examination
Srilakshmi C
|

Updated on: Feb 05, 2026 | 3:41 PM

Share

ఎంతో కఠినమైన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2026 నోటిఫికేషన్‌ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దాదాపు 933 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి.

దేశ వ్యాప్తంగా ఉన్న భారతీయ యువత ఎవరైనా యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు పోటీ పడవచ్చు. అయితే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయో పరిమితి తప్పనిసరిగా ఆగస్టు 1, 2026వ తేదీ నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 24, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం కింద ఓబీసి, ఇతర అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లంచవల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఆధారంగా IAS, IPS, IFS వంటి మొత్తం 28 అఖిల భారత సర్వీసులకు కేటాయంపులు చేస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • యూపీఎస్సీ సీఎస్‌ఈ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 4, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2026 సాయంత్రం 6 గంటల వరకు
  • ప్రిలిమ్స్‌ రాత పరీక్ష తేదీ: మే 24, 2026.
  • ఫలితాల వెల్లడి తేదీ: ఇంకా విడుదల చేయలేదు
  • మెయిన్స్‌ తేదీ: తర్వాత వెల్లడిస్తారు

ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే..

యూపీఎస్సీ సీఎస్‌ఈ 2026 ప్రిలిమినరీ పరీక్షరెండు పేపర్లకు ఉంటుంది. రెండు పేపర్లలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో మాత్రమే ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఇందుల పేపర్ 2 పరీక్ష అర్హత పేపర్ మాత్రమే. ఇందులో కనీస అర్హత మార్కులు వచ్చిన వారి పేపర్‌ మాత్రమే మూల్యాంకనం చేస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌ రాసేందుకు అనుమతిస్తారు. మెయిన్స్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో పెన్ను, పేపర్‌ విధానంలో ఉంటుంది. ఇందులోనూ అర్హత సాధిస్తే అంతిమంగా ఇంటర్వ్యూ నిర్వహించి రిజర్వేషన్‌ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు.

యూపీఎస్సీ CSE 2026 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.