Gold Price Rise: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో బంగారం తప్పనిసరి కావాల్సిందే. అయితే భారతీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలన్నా భయపడే రోజులు వచ్చాయి. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Gold Price Rise: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
Gold Silver Price
Follow us

|

Updated on: Apr 18, 2024 | 7:29 PM

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో బంగారం తప్పనిసరి కావాల్సిందే. అయితే భారతీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలన్నా భయపడే రోజులు వచ్చాయి. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

కొనుగోలుదారుల కళ్లు మిరుమిట్లు గొలిపేలా బంగారం ధగధగ మెరిసిపోతోంది. కేవలం 2 నెలల్లోనే బంగారం ధరలు రూ.11 వేలు పెరిగింది. ఇక వెండి గురించి మాట్లాడితే.. కేవలం రెండు నెలల్లోనే రూ.13 వేలకు పైగా ధర పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మీరు కూడా ఆభరణాలు కొనడానికి సిద్ధమవుతున్నట్లయితే ఈ వార్త చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బులియన్‌ మార్కెట్‌ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా లేదా భవిష్యత్తులో చౌకగా మారుతుందా..? లేదా పెరుగుతుందా? అనేదాని గురించి తెలుసుకుందాం.

ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, ఫిబ్రవరి 23న, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,000. ఏప్రిల్ 18న రాత్రి 7 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.73,800గా ఉంది.అంటే 2 నెలల లోపే బంగారం ధర రూ.11 వేలకుపైగా పెరిగింది.

వెండికి కూడా వరుసగా రెక్కలు వచ్చాయి . 2 నెలల కింద వెండి ధరలు దాదాపు రూ.17 వేలు పెరిగింది. ఫిబ్రవరి 23న కిలో వెండి ధర రూ.69,653గా ఉంది. ఏప్రిల్ 18న కిలో వెండి ధర రూ.86,500కి చేరింది. ఈ విధంగా చూస్తే 2 నెలల లోపు వెండి ధర రూ.16,847 పెరిగింది.

ఇప్పుడే కొనడమా? వేచి ఉండడమా?

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా పరిస్థితి మరింత దిగజారుతుందని కమోడిటీ నిపుణుడు అజయ్ కేడియా చెప్పారు. 2024 ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ట్రెండ్ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, అనేక దేశాల సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోలు కారణంగా, డిమాండ్ పెరుగుతోంది. సహజంగానే ఎవరైనా ఆభరణాలు కొనవలసి వస్తే, అతను ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే ధరలు తగ్గే వరకు వేచి ఉండటం సరికాదు. ఆగస్టు తర్వాత బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించినా అది కూడా తాత్కాలికమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles