AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొగుడొద్దు.. ప్రియుడే ముద్దు..! హనీమూన్ మర్డర్‌ను మించి.. భర్తను ఎలా లేపేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

సమాజంలో జరుగుతున్న సంఘటను చూస్తుంటే జనాల్లో పెళ్లి చేసుకోవాలనే ఆశ రోజురోజుకూ మరింత చచ్చిపోతుంది.ఈ మధ్య కాలంలోనే భర్తను హనీమూన్ పేరిట రాష్ట్రంకాని రాష్ట్రానికి తీసుకెళ్లి ఓ భార్య హత్య చేయగా.. ఆ ఘటన జరిగిన నెల వ్యవధిలోనే అచ్చం అలాంటి ఘటన మన తెలంగాణలోని గద్వాలా జిల్లాలో వెలుగు చూసింది. ఈ రెండు ఘటనల నుంచి జనాలు తేలుకోకముందే మళ్లీ అలాంటి ఘటనే రాజస్థాన్‌లో జరిగింది.

మొగుడొద్దు.. ప్రియుడే ముద్దు..! హనీమూన్ మర్డర్‌ను మించి.. భర్తను ఎలా లేపేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Honeymoon Murder Rajasthan
Anand T
|

Updated on: Feb 05, 2026 | 5:03 PM

Share

వాళ్లకు ఇటీవలే కొత్తగా పెళ్లైంది. సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్దామని భార్య భర్తను అడిగింది. దీంతో భార్యను తీసుకొని భర్త బయటకు బయల్దేరారు. హైవే పక్కన వాహనం ఆపి అలా వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంతో వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం వారిని ఢీకొట్టింది. ఆ ప్రమాదంతో భర్త మృతి చెందగా భార్య గాయాలతో బయటపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాళ్లను హాస్పిటల్‌కు తరలించారు.

అయితే హాస్పిటల్‌లో స్ట్రెచ్చర్‌పై భర్త అశీశ్‌ మృతదేహాన్ని చూసిన అంజూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమెను చూసి అక్కడున్న వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఘటనపై తొలుత హిట్‌ అండ్‌ రన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మొదటగా భార్య అంజూ ప్రశ్నించగా ఆమె పొంతలేని సమాధానాలు చెప్పింది. అలానే తన బంగారు నగలు ఎవరో ఎత్తుకెళ్లారని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులకు డౌట్ వచ్చి అన్ని కోణాల్లో విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ శ్రీగంగానగర్ జిల్లాకు చెందిన అంజూ, ఆశీశ్‌కు గత మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని మంజూ తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేయించింది. అనంతరం దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

కేసు స్టేట్‌మెంట్ తీసుకునే సమయంలో అంజూ ఒక్కోసారి ఒక్కోలా వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమె కాల్ హిస్టరీ చెక్‌ చేశారు. అప్పుడే ఆమె సంజూ అనే వ్యక్తితో ఎక్కువ మాట్లాడినట్టు తెలుసుకున్నారు. అయితే ఆశీశ్‌తో వివాహం జరిగాక ఆ కాల్స్ మరింత పెరిగాయని.. అందుకే అంజూనే తన ప్రియుడితో కలిసి ఇదందతా చేసి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్‌లో విచారించగా అసలు విషయం ఒప్పుకున్నారు.

తాను-సంజూ ప్రేమించుకున్నామని.. తన ఇంట్లో వాళ్లు ఆశీశ్‌తో ఇష్టం లేకుండా పెళ్లి చేశారని అంజూ చెప్పుకొచ్చింది. అందుకే సంజూ ఇంటికి వెళ్లి ఆశీశ్‌ను అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ చేసుకున్నామని.. అందుకు సంజూ స్నేహితులు కూడా సహకరించడంతో సక్సెస్‌ఫుల్‌గా ఆశీశ్‌ను హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరించినట్టు పేర్కొంది. కానీ దొంగతనం చేసినట్టు నాటకం ఆడేందుకు ప్రయత్నిస్తే.. పోలీసులే హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయడంతో తమ పని మరింత ఈజీ అయింది అనుకునే లోపే.. పోలీసుల విచారణతో తడబాటు కారణంగా దొరిపోయామని ఆమె చెప్పుకొచ్చింది.

అంజూ వాంగ్మూలంతో హిట్ రన్ కేసు కాస్తా హత్య కేసుగా మార్చుకున్న పోలీసులు అశీశ్‌ భార్య అంజుతో పాటు ఆమె ప్రియడు సంజు, అతని స్నేహితులు రాకీ, బాదల్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us