AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తుందా? విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదని ప్రధాని మోదీ అంగీకరించారని డోనాల్డ్ ట్రంప్ చెప్పారనే అమెరికా వాదనలను భారత్ తోసిపుచ్చింది. 1.4 బిలియన్ల భారతీయులకు ఇంధన భద్రతను కల్పించడమే అత్యంత ప్రాధాన్యత అని భారత్ పదే పదే బహిరంగంగా ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తుందా? విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు
Randhir Jaiswal, Mea
Balaraju Goud
|

Updated on: Feb 05, 2026 | 5:35 PM

Share

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదని ప్రధాని మోదీ అంగీకరించారని డోనాల్డ్ ట్రంప్ చెప్పారనే అమెరికా వాదనలను భారత్ తోసిపుచ్చింది. 1.4 బిలియన్ల భారతీయులకు ఇంధన భద్రతను కల్పించడమే అత్యంత ప్రాధాన్యత అని భారత్ పదే పదే బహిరంగంగా ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మార్కెట్ పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా భారతదేశం తన ఇంధన కొనుగోళ్లను వైవిధ్యపరుస్తుందని ఆయన అన్నారు.

“మన అవసరాలకు అనుగుణంగా ప్రపంచంలోని ఏ దేశం నుండైనా చమురు కొనుగోలు చేయవచ్చు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం ఉంటుంది. భారత ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు దేశప్రజలను దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం జరుగుతుంది.” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతదేశంతో ఇంధన సహకారం కొనసాగుతుందని రష్యా కూడా పేర్కొంది. “భారతదేశం వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. మా వాణిజ్యం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది” అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

వెనిజులా నుండి చమురు కొనుగోలుకు సంబంధించి, విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. వెనిజులా ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి రంగాలలో దీర్ఘకాల భాగస్వామిగా ఉందని పేర్కొంది. “మేము 2019-20 వరకు వెనిజులా నుండి ఇంధనం, ముడి చమురును దిగుమతి చేసుకున్నాము, ఆ తర్వాత ఆపాల్సి వచ్చింది. అనంతరం 2023-24లో వెనిజులా నుండి చమురు కొనుగోలు చేయడం ప్రారంభించాము, కానీ ఆంక్షలు విధించిన తర్వాత ఆపాల్సి వచ్చింది” అని రణధీర్ జైస్వాల్ అన్నారు.

“ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి, సుంకాల తగ్గింపుకు అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులు ఇప్పుడు 18% తక్కువ సుంకంతో అమెరికాకు ఎగుమతి చేయబడతాయని ప్రధాని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం మన ఎగుమతులను పెంచుతుంది. ఇది భారతదేశంలో శ్రమతో కూడిన పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మన ప్రజలకు వృద్ధి, శ్రేయస్సు సాధిస్తారు.” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇదిలావుంటే, ఇరాన్‌లో బందీలుగా ఉన్న 16 మంది భారతీయుల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. “ఇరాన్‌లోని 16 మంది నావికులను కలవడానికి మాకు అనుమతి లభించింది. మా అధికారులు బందర్ అబ్బాస్‌లో వారిని కలిశారు. 16 మందిలో ఎనిమిది మంది విడుదలై స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మిగిలిన ఎనిమిది మంది గురించి మేము ఇరాన్ అధికారులతో సంప్రదిస్తున్నాము. వారికి ఎలా సహాయం చేయవచ్చో చూస్తున్నాము.” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!
రూ.2కే కోడిగుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే గుట్టురట్టు
రూ.2కే కోడిగుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే గుట్టురట్టు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!