AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Records : టీ20 వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు..అసలేం జరిగింది?

T20 World Cup Records : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన ఈ ఆటగాడు, ఇప్పుడు సొంత దేశానికి వెళ్లాలన్నా, అక్కడ అడుగు పెట్టాలన్నా వణికిపోతున్నాడు.

T20 World Cup Records : టీ20 వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు..అసలేం జరిగింది?
Shakib Al Hasan
Rakesh
|

Updated on: Feb 05, 2026 | 2:00 PM

Share

T20 World Cup Records : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన ఈ ఆటగాడు, ఇప్పుడు సొంత దేశానికి వెళ్లాలన్నా, అక్కడ అడుగు పెట్టాలన్నా వణికిపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 50 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా షకీబ్ అల్ హసన్ రికార్డులకెక్కాడు. మొత్తం 43 మ్యాచ్‌ల్లో 20.12 సగటుతో ఆయన ఈ ఘనత సాధించాడు. అయితే మైదానంలో ఇంతటి ఘనత సాధించిన షకీబ్, మైదానం బయట మాత్రం రాజకీయ సెగలో చిక్కుకున్నాడు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా, ఆమె పార్టీ (అవామీ లీగ్) నుంచి ఎంపీగా గెలిచిన షకీబ్.. అక్కడ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి దేశానికి దూరంగా ఉంటున్నాడు. తనపై ఉన్న కేసుల కారణంగా స్వదేశానికి వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయం అతడిని నీడలా వెంటాడుతోంది.

సొంత గడ్డపై ఆఖరి మ్యాచ్ ఆడాలన్న ఆశ

షకీబ్ అల్ హసన్ గతేడాది డిసెంబర్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. బంగ్లాదేశ్‌లో ఒక వన్డే, ఒక టెస్ట్, ఒక టీ20 సిరీస్ ఆడి, తన సొంత ప్రేక్షకుల మధ్య గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలని ఆయన ఆకాంక్షించాడు. కానీ గతంలో అతడికి భద్రత కల్పించలేమని చెప్పిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఇప్పుడు కాస్త మెత్తబడింది. షకీబ్ కోసం టీమ్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని బోర్డు ప్రకటించినప్పటికీ, చట్టపరమైన చిక్కుల నుంచి అతడికి పూర్తి భరోసా లభించలేదు. దీనివల్ల ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్సే!

టీ20 వరల్డ్ కప్‌లో షకీబ్ హవా

ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది దిగ్గజ బౌలర్లు ఉన్నా, టీ20 ప్రపంచకప్‌లో షకీబ్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. షకీబ్ 50 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ ఆఫ్రిది 39 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అంటే వీరిద్దరి మధ్య 11 వికెట్ల భారీ వ్యత్యాసం ఉంది. మూడో స్థానంలో లసిత్ మలింగ (38 వికెట్లు), నాలుగో స్థానంలో వానిందు హసరంగా (37 వికెట్లు), ఐదో స్థానంలో రషీద్ ఖాన్ (37 వికెట్లు) ఉన్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో షకీబ్ ఎంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడో అర్థమవుతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
భలే ఛాన్స్.. జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు
భలే ఛాన్స్.. జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు
ఇల్లు చూడాలంటే నెల అద్దె కట్టాలా.. బెంగళూరులో సెక్యూరిటీ గార్డు..
ఇల్లు చూడాలంటే నెల అద్దె కట్టాలా.. బెంగళూరులో సెక్యూరిటీ గార్డు..
భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.!
భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.!
ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది
ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది