AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్‌లో సినిమాల జాతర.. రిలీజ్‌కు రెడీ అవుతున్న అరడజను సినిమాలు

కొత్త సినిమాలు ప్రతి నెల పదుల సంఖ్యలో విడుదలవుతున్నాయి. కానీ ఈ సమ్మర్ లో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. దాంతో ఆడియన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. మేలో చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కాకపోవడంతో ఇప్పుడు జూన్ పై అందరు దృష్టి పెట్టారు.

జూన్‌లో సినిమాల జాతర.. రిలీజ్‌కు రెడీ అవుతున్న అరడజను సినిమాలు
Movies
Rajeev Rayala
|

Updated on: May 30, 2026 | 7:09 AM

Share

నిజానికి సమ్మర్ సీజన్ లో సినిమాల సందడి ఎక్కువ ఉండాలి. సమ్మర్ హాలిడేస్ ను ఉపయోగించుకోవడానికి మేకర్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు ఈ క్రమంలోనే ఏప్రిల్, మే , జూన్ నెలల్లో సినిమాలు విడుదల చేయాలని చూస్తుంటారు. కానీ ఈ ఈఏడాది మే సప్పగా సాంగింది. పెద్దగా సినిమాల హడావిడి కనిపించలేదు. విడుదలైన ఒకటి ఎండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయాయి. ఇక ఇప్పుడు జూన్ పై అందరి దృష్టి పడింది. జూన్ ను టార్గెట్ చేసుకొని అరడజను సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. మరి వీటిలో ఏది విజయం సాధిస్తుందో చూడాలి. ఇక జూన్ లో విడుదల కానున్న సినిమాల పై ఓ లుక్కేద్దాం..!

జూన్ లో విడుదలవుతున్న మొదటి బిగెస్ట్ సినిమా పెద్ది. బుచ్చుబాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచుస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా భారీ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫాన్స్. అలాగే పెద్ది సినిమా తర్వాత సింగ్ గీతం అనే సినిమా వస్తుంది.  సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కామెడీ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఈ సినిమా జూన్ రెండో వారంలో విడుదలకానుంది.

ఇక సమంత హీరోయిన్ గా నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా కూడా జూన్ లో విడుదలకానుంది. సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేషన్ లో నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఇంటి బంగారం సినిమా జూన్ మూడో వారంలో  విడుదలకానుంది. అలాగే అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా కూడా జూన్ మూడో వారంలో విడుదలకానుంది. దీవానా, ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు, బాలన్ లాంటి సినిమాలు కూడా విడుదలకానున్నాయి. ఫైనల్ గా తమిళ్ సీఎం దళపతి విజయ్ నటించిన లాస్ట్ మూవీ జననాయగన్ కూడా జూన్ లోనే విడుదలకానుంది. ఈ సినిమాల్లో ఏ సినిమా భారీ హిట్ అవుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us