Fuel Efficiency: E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా? ఇంధనంపై కీలక నివేదిక
Fuel Efficiency: మంత్రిత్వ శాఖ ప్రకారం.. E10 కోసం రూపొందించిన వాహనాలలో ఈ E20 ఇంధనం పెద్దగా మైలేజీ ప్రభావం ఉండదని చెబుతోంది. పాత వాహనాలలో మైలేజీ తగ్గుతుందంటే అది పాత వాహనం వల్లేనని చెబుతోంది. ఒక వేళ పాత వాహనాలలో 1 శాతం..

Fuel Efficiency: వాహనాల్లో 20 శాతం ఇథనాల్-మిశ్రమ పెట్రోల్ ( E20) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కానీ ఆటోమొబైల్ పరిశ్రమతో సంబంధం ఉన్న కొంతమంది నిపుణులు ఈ రకమైన ఇంధనం వాహనాల ఇంధన సామర్థ్యాన్ని, అంటే మైలేజీని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. E20 వాడకం వల్ల మైలేజ్ 2 నుండి 5 శాతం తగ్గుతుందని వారు విశ్వసిస్తున్నారు.
Washing Powder Nirma: ఒకప్పుడు దేశాన్ని ఏలిన ‘నిర్మా’ ఇప్పుడు ఏమైపోయింది..? ఒక తప్పు వల్ల కనుమరుగు
మైలేజ్ ఎందుకు తగ్గుతుంది?
ఇథనాల్ క్యాలరీ విలువ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంటే ఇథనాల్‌ను కాలినప్పుడు పెట్రోల్ కంటే తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపినప్పుడు వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గడానికి ఇదే కారణం.
ఇది కూడా చదవండి: Nita Ambani: నీతా అంబానీ లైఫ్‌స్టైల్ గురించి మీకు తెలుసా? ఆమె ఫిట్‌నెస్ రహస్యాలు ఇవే
పాత వాహనాలపై ప్రభావం:
కొత్త వాహనాలు క్రమంగా E-20 కి అనుకూలంగా మారుతున్నాయి. కానీ పాత మోడళ్లకు ఇది ఒక సవాలుగా మారవచ్చు. దీర్ఘకాలంలో పాత వాహనాల్లోని గాస్కెట్లు, ఇంధన రబ్బరు పైపులు, గొట్టాలు వంటి భాగాలు అరిగిపోవచ్చని ఇంజనీర్లు అంటున్నారు. అయితే ఈ ప్రభావం వెంటనే కనిపించదు.
E20 వల్ల మైలేజ్ భారీగా తగ్గుతుందని సోషల్ మీడియాలో ప్రచారంలో జరుగుతుండటంతో చమురు మంత్రిత్వ శాఖ స్పందించింది. మైలేజీ తగ్గుతుందని అనడంలో నిజం లేదని తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, పాత వాహనాలలో ( E10 అనుకూలమైనది) కూడా మైలేజ్ తగ్గుదల చాలా తక్కువ. చాలా కంపెనీలు 2009 నుండే E20- అనుకూల వాహనాలను తయారు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Traffic Challan Rule: ఇక ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం.. చెల్లించని చలాన్‌లపై మరిన్ని ఛార్జీలు!
దీనిపై E20 కోసం ట్యూన్ చేసిన వాహనాలు మెరుగైన పనితీరును ఇవ్వడమే కాకుండా నగర డ్రైవింగ్ పరిస్థితులలో వేగవంతంగా అందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో పాటు ఇథనాల్ బాష్పీభవన వేడి పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇంజిన్ ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. గాలి-ఇంధన మిశ్రమం దట్టంగా మారుతుంది. దీని ప్రయోజనం వాల్యూమెట్రిక్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది.
అది ఎంత ప్రభావం చూపగలదు?
మంత్రిత్వ శాఖ ప్రకారం.. E10 కోసం రూపొందించిన వాహనాలలో ఈ E20 ఇంధనం పెద్దగా మైలేజీ ప్రభావం ఉండదని చెబుతోంది. పాత వాహనాలలో మైలేజీ తగ్గుతుందంటే అది పాత వాహనం వల్లేనని చెబుతోంది. ఒక వేళ పాత వాహనాలలో 1 శాతం మాత్రమే మైలేజీ తగ్గే అవకాశాలు ఉండవచ్చని చెబుతోంది.
ఇది కూడా చదవండి: Traffic Challan: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ మొత్తంలో 75 శాతం మాఫీ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








