Vande Bharat Sleeper: మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఎక్కడి నుంచో తెలుసా?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాలనుకునే వారికి శుభవార్త. భారతీయ రైల్వేల నుండి దేశం త్వరలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంంది. నివేదిక ప్రకారం, వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) నాటికి భారతదేశం మొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించవచ్చు..

Vande Bharat Sleeper: మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఎక్కడి నుంచో తెలుసా?
Vande Bharat Sleeper Train
Follow us

|

Updated on: Jul 24, 2024 | 11:29 AM

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాలనుకునే వారికి శుభవార్త. భారతీయ రైల్వేల నుండి దేశం త్వరలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంంది. నివేదిక ప్రకారం, వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) నాటికి భారతదేశం మొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించవచ్చు. ఢిల్లీ-ముంబై మధ్య ఈ రైలు నడుస్తుందని చెబుతున్నారు. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించవచ్చు. బెంగుళూరులో వందే భారత్ స్లీపర్ రైలు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, అది ఇప్పుడు చివరి దశలో ఉందని నివేదికను ఉటంకిస్తూ ఇండియా టీవీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: నిర్మలా సీతారామన్ దెబ్బకు బంగారం ధర ఢమాల్.. మరీ ఇంతలానా..?

నివేదిక ప్రకారం, వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో థర్డ్ ఏసీకి 10 కోచ్‌లు, సెకండ్ ఏసీకి 4 కోచ్‌లు, ఫస్ట్ ఏసీకి ఒక కోచ్‌లు కేటాయిస్తారని తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైలులో 2 సీటింగ్ కమ్ లగేజ్ ర్యాక్ (SLR) కోచ్‌లు కూడా ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైలు మొదటి దశలో గంటకు 130 కి.మీ వేగంతో నడుస్తుందని వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాత క్రమంగా రైలు వేగాన్ని పెంచే యోచనలో ఉన్నారు. ఈ రైలు గంటకు 160 నుంచి 220 కి.మీ వేగంతో నడపగలదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ – ముంబై మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు?

ఢిల్లీ – ముంబై మధ్య మాత్రమే వందే భారత్ స్లీపర్ రైలును నడపాలని రైల్వే ఎందుకు ప్లాన్ చేసింది? దీనికి సమాధానంగా ఢిల్లీ-ముంబై మార్గం చాలా రద్దీగా ఉంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటి డిమాండ్ కూడా పెరిగింది. మరోవైపు, బుల్లెట్ రైలుకు సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌లోని ఢిల్లీ-ముంబై నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేపై 130 మీటర్ల పొడవైన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉక్కు వంతెన నిర్మాణం పూర్తయింది. గుజరాత్‌లోని వడోదర సమీపంలో ఢిల్లీ-ముంబై జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉక్కు వంతెనను నిర్మించారు.

రోడ్డు రాకపోకలకు అంతరాయం కలగకుండా స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని 24 గంటల్లో పూర్తి చేశారు. వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. వీటిలో థర్డ్ ఏసీకి 10 కోచ్‌లు, సెకండ్ ఏసీకి 4 కోచ్‌లు, ఫస్ట్ ఏసీకి ఒక కోచ్‌లు కేటాయించనున్నారు. వందే భారత్ స్లీపర్ రైలులో 2 సీటింగ్ కమ్ లగేజ్ ర్యాక్ (SLR) కోచ్‌లు కూడా ఉంటాయి.

ఇది కూడా చదవండి: School Holiday: సంచలన నిర్ణయం.. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి