AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vandebharat Trains: వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయి! లోపల సెటప్ సూపర్!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్! ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. దీనిపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేసారు. ఈ రైళ్లు ముందుగా ఏయే రూట్స్ లో ప్రయాణించనున్నాయో తెలిపారు. వీటి గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Vandebharat Trains: వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయి! లోపల సెటప్ సూపర్!
Vandebharat Trains
Nikhil
|

Updated on: Sep 25, 2025 | 11:59 AM

Share

తక్కువ టైంలో ఎక్కువ దూరాన్ని కవర్ చేసే ట్రైన్స్ గా వందేభారత్ ట్రైన్స్ బాగా పాపులర్ అయ్యాయి. కేవలం ఆరు లేదా ఏడు గంటల్లో గమ్యాన్ని చేరుకోవడం ఈ ట్రైన్స్ స్పెషాలిటీ. అయితే ప్రస్తుతం వందేభారత్ ట్రైన్స్ లో సీటింగ్ ఆప్షన్ మాత్రమే ఉంది. స్లీపర్ సౌకర్యం కూడా ఉంటే బాగుంటుందని రైల్వే ప్రయాణికులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే ఎట్టకేలకు వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తున్నట్టు తెలుస్తుంది.

దీపావళి నుంచి..

వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభంపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. దీపావళి నాటికి ఈ స్లీపర్ రైళ్లు సిద్దం అవుతాయని ప్రకటించారు. ఇప్పటికే ఒక రైలు రెడీ అవ్వగా  రెండో రైలు నిర్మాణంలో ఉందని తెలిపారు. ఈ రైళ్లను ఒకే సారి ప్రారంభిస్తామని చెప్పారు. మొదటి సర్వీస్.. పాట్నా, ఢిల్లీ మధ్యన ఉంటుంది. మిగతా సిటీలకు కూడా త్వరలోనే సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సదుపాయాలు ఇవే..

వందేభారత్‌ స్లీపర్ రైలు చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారవుతోంది. 16 కోచ్‌లతో ఉండే వందే భారత్ స్లీపర్​రైలు గంటకు 180కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణీకుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఉంటాయని చెప్తున్నారు. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే కవచ్‌ అనే వ్యవస్థ ఉంటుంది. అలాగే  అన్ని కోచ్‌లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాడీతో తయారుచేశారు. ఫైర్ యాక్సిడెంట్స్ ను తట్టుకునేలా వీటిని రూపొందించారు. వీటితోపాటు  ట్రైన్స్ లో ఆటోమేటిక్‌ డోర్లు, అప్ డేటెడ్ మరుగు దొడ్లు, సరికొత్త సీటు కుషన్‌లు ఉంటాయి. వందేభారత్ స్లీపర్ ట్రైన్ లో  16 కోచ్‌లు, 823 బెర్త్‌లు ఉంటాయి. ఇందులో 3టైర్‌ ఏసీ కోచ్‌లు 11, 2 టైర్‌ ఏసీ కోచ్‌లు 4, ఒక ఫస్ట్‌ టైర్‌ ఏసీ కోచ్‌ ఉంటాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఇద్దరు అన్నాదమ్ముల్లు తోపు హీరోలు..
ఇద్దరు అన్నాదమ్ముల్లు తోపు హీరోలు..
జూన్‌ 21వ తేదీన నీట్‌(UG) పరీక్ష నిర్వహిస్తామన్న NTA
జూన్‌ 21వ తేదీన నీట్‌(UG) పరీక్ష నిర్వహిస్తామన్న NTA
పాములను తరిమి కొట్టే కొబ్బరికాయ మంత్రం..ఇలా చేస్తే అవి పరుగోపరుగు
పాములను తరిమి కొట్టే కొబ్బరికాయ మంత్రం..ఇలా చేస్తే అవి పరుగోపరుగు
శని అమావాస్య నాడు ఈ నియమాలు పాటించకపోతే దురదృష్టం వెంటాడుతుందా?
శని అమావాస్య నాడు ఈ నియమాలు పాటించకపోతే దురదృష్టం వెంటాడుతుందా?
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..