AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఒకసారి వడ్డీ రేట్లు చెక్ చేయండి!

నవరాత్రి, దీపావళి వంటి పండుగల సీజన్ లో కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తే మంచిదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. సొంతిల్లు తీసుకోవడానికి కూడా ఇదే బెస్ట్ టైం అని చెప్తుంటారు. ఒకవేళ మీరు హోమ్ లోన్ కోసం చూస్తున్నట్టయితే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ హోమ్ లోన్స్, వాటి వడ్డీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఒకసారి వడ్డీ రేట్లు చెక్ చేయండి!
Home Loan
Nikhil
|

Updated on: Sep 25, 2025 | 12:42 PM

Share

మనదేశంలో ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పండుగల సీజన్ మంచిదని భావిస్తుంటారు. అందుకే కొత్తగా ఇల్లు కొనాలనుకునేవాళ్లు, హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్లు ఈ సీజన్ నే ఎంచుకుంటారు. ఈ నవరాత్రి సీజన్‌లో మీరు ఇల్లు కొనాలనుకుంటే బెస్ట్ వడ్డీ రేట్లు ఏయే బ్యాంకులు అందిస్తున్నాయో ఒకసారి చూసేయండి!

యస్‌బీఐ హోమ్ లోన్

ప్రస్తుతం యస్ బీఐలో  హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.50 నుంచి 8.70 శాతం వరకూ ఉన్నాయి.  యస్ బిఐ హోమ్ లోన్ మ్యాక్స్‌గెయిన్ పథకంపై అయితే వడ్డీ రేటు 7.75 శాతం నుంచి 8.95 శాతం మధ్య ఉంటుంది. హోమ్ లోన్ పై టాప్-అప్ అయితే  8 నుంచి 10.75 శాతం వరకూ ఉంది. ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవాలంటే వడ్డీ రేటు 9.20 శాతం నుంచి 10.75 శాతం వరకూ ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

హోమ్ లోన్స్ కు హెచ్ డీఎఫ్ సీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ బ్యాంక్ .. హోమ్ లోన్ కు సంబంధించిన అన్ని కేటగిరీలకు 7.90 శాతం నుంచి 13.20 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తోంది.

ఐసీఐసీఐ

ఐసీఐసీఐ బ్యాంక్.. రూ.35 లక్షల లోపు హోమ్ లోన్స్ పై 8.75 శాతం నుంచి 9.40 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది.  రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య అయితే వడ్డీ రేటు 8.75 శాతం నుంచి 9.55 శాతం వరకూ ఉంది.  ఇక రూ.75 లక్షలకు పైబడి రుణాలపై 8.75 శాతం నుంచి 9.65 శాతం వరకూ వడ్డీ ఉంటుంది.

ట్యాక్స్ బెనిఫిట్స్

 హోమ్ లోన్ తీసుకునే వాళ్లకు కొన్ని టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం లోన్ లో ఇల్లు తీసుకుంటే సెక్షన్ 24B ప్రకారం ఆస్తిపై రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80C ప్రకారం హోమ్ లోన్ అసలు మొత్తంపై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే సెక్షన్ 80EEA ప్రకాఱం ఫస్ట్ టైం హోమ్ లోన్ తీసుకునే వాళ్లకు రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్