AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI లాంటి టెక్నాలజీ వచ్చినా.. వారు కావాల్సిందే.. 2030 నాటికి ఆ రంగంలో పెను మార్పులు..!

Construction sector: ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఎన్ని ఆధునాతన యంత్రాలు వచ్చినా.. నిర్మాణ రంగంలో కార్మికులు ఉండాల్సిందే.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అందుకే.. పలు ప్రాంతాల నుంచి కార్మికులను తెప్పించుకుని..

AI లాంటి టెక్నాలజీ వచ్చినా.. వారు కావాల్సిందే.. 2030 నాటికి ఆ రంగంలో పెను మార్పులు..!
Construction Sector
Yellender Reddy Ramasagram
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 12, 2023 | 6:24 PM

Share

Construction sector: ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఎన్ని ఆధునాతన యంత్రాలు వచ్చినా.. నిర్మాణ రంగంలో కార్మికులు ఉండాల్సిందే.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అందుకే.. పలు ప్రాంతాల నుంచి కార్మికులను తెప్పించుకుని.. భవన నిర్మాణ కంపెనీలు నిర్మాణాలను చేపడుతున్నాయి. అయితే, రానున్న ఏడు ఏళ్లలో నిర్మాణ రంగంలో లేబర్ కొరత ఉండనుంది అని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కాలంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. ఇక మీదట కూడా భారీగా జరగనున్నాయి. కానీ 2030 నాటికి పెద్ద ఎత్తున నాలుగున్నర కోట్ల లేబర్ షార్టేజ్ ఉండనుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎటు చూసినా కాంక్రీట్ జంగల్ గా మారిన ఈ కాలంలో ఎవరికి వారు సొంత ఇల్లుల కోసం.. సొంత భవనాల చూస్తున్నారు. అంతేకాకుండా.. అన్ని ప్రాంతాల్లో కూడా భారీ భవనాలు నిర్మితమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే కాదు అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ లు నిర్మాణం చేస్తున్నారు.

సొంత ఇల్లు లేని వారు.. సొంత ఇంటి కోసం, డబల్ బెడ్ రూం ఉన్న వారు త్రిబుల్ బెడ్రూమ్ కోసం.. ఇలా విల్లాలు.. అపార్ట్మెంట్లు.. ఎన్నో భవనాలను నిర్మిస్తున్నారు. దీంతోపాటు నగరాలకు వస్తున్న కొత్త కంపెనీలతో భారీ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికోసం పెద్ద ఎత్తున స్కిల్డ్ లేబర్ లు కావాల్సి ఉంది. వీరితో పాటు టెక్నికల్ వర్కర్ల అవసరం బాగా పెరిగింది. వచ్చే 2030 నాటికి దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగానికి దాదాపు నాలుగున్నర కోట్ల స్కీల్డ్ లేబర్ల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కూడా ఈ షార్టేజ్ ని భర్తీ చేయలేమని.. కార్మికులు కావాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు మాన్యువల్ గా జరిగే ప్లానింగ్ పనులకి చాలా సమయం అవసరం ఉండేది.. కానీ ఆటో సిస్టం వచ్చిన తరువాత గంటల్లో వర్క్ అయిపోతుంది. దాని తరవాత టెన్నల్ సిస్టం, మైవన్ సిస్టంతో వర్క్ త్వరగా పూర్తి అవుతుంది.. దీని ద్వారా 150శాతం వరకు మిషనరీ వర్క్ పూర్తి చేస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో స్కిల్డ్ వర్కర్ షార్టేజ్ బాగా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..