AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఏటీఎం ద్వారా సెకన్లలోనే పీఎఫ్ నగదు విత్ డ్రా.. ఎలా చేసుకోవాలంటే..? బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం..

దేశంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ పీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ సేవలను ఉద్యోగులకు సులభతరంగా అందించేందుకు కేంద్రం 3.0 వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఇందుకలో భాగంగా క్లెయిమ్స్ చెల్లింపు వ్యవస్థలో మార్పులు తీసుకురానుంది. ఏప్రిల్ తర్వాత కొత్త మార్పులు రానున్నాయి.

EPFO: ఏటీఎం ద్వారా సెకన్లలోనే పీఎఫ్ నగదు విత్ డ్రా.. ఎలా చేసుకోవాలంటే..? బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం..
Epfo 2
Venkatrao Lella
|

Updated on: Mar 27, 2026 | 9:47 PM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు భారీ ఊరట కలిగింది. ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా నగదు విత్ డ్రాలను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా త్వరలో ఏటీఎం నుంచి డబ్బులను ఉపసంహరించుకునే సౌకర్యాన్ని తీసుకురానుంది. ఇది అందుబాటులోకి వస్తే పీఎఫ్ సొమ్మును ఏదైనా బ్యాంక్ ఏటీఎం నుంచి సులువుగా సెకన్లలోనే విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ డబ్బులను తీసుకోవాలంటే ప్రక్రియ చాలా క్లిష్టతరంగా ఉంది. మూడు రోజుల వరకు సమయం పడుతుంది. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్లి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి అలాంటి పని ఉండదు. మీ సమీపంలోని ఏటీఎం నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు.

పీఎఫ్ ఏటీఎం ఎలా పనిచేస్తుందంటే..?

ఈపీఎఫ్‌వో తమ ఖాతాదారులకు ఒక ప్రత్యేక ఏటీఎం కార్డులను జారీ చేస్తుంది. ఈ కార్డును మీరు డెబిట్ కార్డులా ఉపయోగించుకోవచ్చు. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 25 శాతం మినహా మిగతా 75 శాతం సొమ్మును మీరు ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. మీ సమీపంలోని ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి అయినా ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం సౌకర్యం ద్వారా ఒకేసారి రూ.2 లక్షల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం కేంద్రం కల్పించనుందని వార్తలు వస్తున్నాయి. ఇక 3 సంవత్సరాల సర్వీస్ తర్వాత రూ.2 లక్షలు విత్ డ్రా చేస్తే… 10 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. అదే ఐదు సంవత్సరాల తర్వాత చేస్తే ఎలాంటి ట్యాక్సులు ఉండవు.

పరిమితులు ఇవే..

వైద్య, ఇంటి ఖర్చులు, ఉద్యోగం కోల్పోయిన సమయంలో అత్యవసర నగదు అవసరాల కోసం పీఎఫ్ మొత్తం నగదులో 75 శాతం తీసుకోవచ్చు. ఇక మిగతా 25 శాతం ఉద్యోగం మానేశాక తీసుకోవచ్చు. ఇక 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే.. పీఎప్ విత్ డ్రాలకు ఎలాంటి పన్ను ఉండదు. ఇక 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకపోతే ట్యాక్స్ విధిస్తారు. అటు త్వరలో యూపీఐ ద్వారా పీఎఫ్ చందాలను తీసుకునే సౌకర్యం ఈపీఎఫ్‌వో కల్పించనుంది. ఏప్రిల్ నుంచి ఈ సదుపాయం ప్రవేశపెడతారని తెలుస్తోంది. తొలుత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బీమ్ యాప్‌లో ఈ ఫీచర్ తీసుకురానున్నారు. అనంతరం ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి మిగతా యాప్స్‌లలో కూడా  ప్రవేశపెట్టనున్నారు.

Follow Us
ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రాపై బిగ్ అప్డేట్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రాపై బిగ్ అప్డేట్..
మిగిలిపోయిన రైస్ పారేయకండి.. ఇలా పుదీనా రైసే చేస్తే ప్లేటు ఖాళీ
మిగిలిపోయిన రైస్ పారేయకండి.. ఇలా పుదీనా రైసే చేస్తే ప్లేటు ఖాళీ
పుచ్చకాయలోని ఈ పార్ట్ తింటే జెట్ స్పీడ్ తో బరువు తగ్గుతారట!
పుచ్చకాయలోని ఈ పార్ట్ తింటే జెట్ స్పీడ్ తో బరువు తగ్గుతారట!
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు
వెల్లుల్లిని సరైన పద్దతిలో తీసుకుంటే అమృతం.. లేదంటే విషం..
వెల్లుల్లిని సరైన పద్దతిలో తీసుకుంటే అమృతం.. లేదంటే విషం..
ఒక్క కిలోమీటర్ మంత్రం.. రోజూ నడిస్తే ఎంత కొవ్వు కరుగుతుందంటే..?
ఒక్క కిలోమీటర్ మంత్రం.. రోజూ నడిస్తే ఎంత కొవ్వు కరుగుతుందంటే..?
మోనాలిసా ఆరోపణలు ఖండించిన దర్శకుడు.. ఏమన్నారంటే..
మోనాలిసా ఆరోపణలు ఖండించిన దర్శకుడు.. ఏమన్నారంటే..
కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా వేరియంట్‌తో అలజడి
కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా వేరియంట్‌తో అలజడి
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి