AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఆ సర్టిఫికెట్ స్థానంలో ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్..

డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బోర్డు ఆమోదించింది.

EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఆ సర్టిఫికెట్ స్థానంలో ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్..
Epfo
Shaik Madar Saheb
|

Updated on: Jul 31, 2022 | 5:20 AM

Share

Digital life certificate: ఉద్యోగులు, యజమానుల మధ్య మెరుగైన సహకారం, సామరస్యం కోసం త్వరలో కొత్త లిటిగేషన్ పాలసీని తీసుకురానున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇద్దరి మధ్య వివాదాలను తగ్గించి హక్కులను కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఈపీఎఫ్ఓ పింఛనుదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బోర్డు ఆమోదించింది. EPFO.. తన 73 లక్షల మంది పెన్షనర్లు ఎక్కడి నుంచైనా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించే సౌకర్యాన్ని శనివారం ప్రారంభించింది.

జీవిత ధృవీకరణ పత్రాలను దాఖలు చేయడానికి వృద్ధాప్యం కారణంగా వారి బయో-మెట్రిక్స్ (వేలిముద్ర – ఐరిస్) పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న పాత పెన్షనర్లకు ఈ ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ సహాయం చేస్తుంది. EPFO అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేంద్ర యాదవ్ పెన్షనర్లకు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతకుముందు రోజు CBT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్) 231వ సమావేశంలో పెన్షనర్లకు EPFO సేవలను మరింత మెరుగుపరచడానికి పెన్షన్, కేంద్రీకృత పంపిణీకి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పుడు పెన్షనర్లకు సెంట్రల్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సూత్రప్రాయంగా ఆమోదం లభించనట్లయింది. అదే సమయంలో పెన్షన్ సమాచారం కోసం డిజిటల్ కాలిక్యులేటర్ కు కూడా ఆమోదం తెలిపారు.

ఇవి కూడా చదవండి

పెన్షన్, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాలిక్యులేటర్‌ను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇది పెన్షనర్, కుటుంబ సభ్యులకు పెన్షన్ – డెత్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను లెక్కించేందుకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందిస్తుంది. అలాగే, పెన్షన్ మొత్తం ఖాతాలో బదిలీ చేయబడుతుంది. ఇది ఆన్లైన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. అలాగే, ఆయుష్మాన్ భారత్ పథకంతో ESICని అనుసంధానించాలని నిర్ణయించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..