Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. ఆగస్టులో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
Bank Holidays August 2022: పండగలు, పర్వదినాలు లేకపోవడంతో జూన్, జులై మాసాల్లో పెద్దగా సెలవులు రాలేదు. వీకెండ్‌లో వచ్చే సెలవులు తప్ప ఇతర హాలీడేస్ ఏమీ రాలేదు. అయితే ఆగస్టు నుంచి ఫెస్టివల్ సీజన్ మొదలుకానుంది.
Bank Holidays August 2022: పండగలు, పర్వదినాలు లేకపోవడంతో జూన్, జులై మాసాల్లో పెద్దగా సెలవులు రాలేదు. వీకెండ్‌లో వచ్చే సెలవులు తప్ప ఇతర హాలీడేస్ ఏమీ రాలేదు. అయితే ఆగస్టు నుంచి ఫెస్టివల్ సీజన్ మొదలుకానుంది. ఇండిపెండెన్స్ డే, మొహర్రం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, వినాయక చవితి తదితర పండగలు ఆగస్టులోనే రానున్నాయి. దీంతో బ్యాంకులకు సెలవులు(Bank Holidays) భారీగానే ఉన్నాయి. ఈక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేసింది. మరి RBI వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఆగస్టులో బ్యాంకులు ఏయే రోజుల్లో మూతపడనున్నాయో తెలుసుకుందాం రండి.
ఆగస్టులో బ్యాంకు సెలవులివే..
- ఆగస్టు 1న ద్రుపక షీ-జీ పర్వదినం కారణంగా సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్‌టక్‌లో అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి)
- ఆగస్టు 7న ఆదివారం
- 8 ఆగస్టు – మొహర్రం
- 9 ఆగస్టు- మొహర్రం – చండీగఢ్, గౌహతి, ఇంఫాల్, డెహ్రాడూన్, తిరువనంతపురం, భువనేశ్వర్, జమ్మూ, పనాజీ, షిల్లాంగ్ మినహా దేశమంతా సెలవు ఉంటుంది
- 11, 12 ఆగస్టు – రక్షాబంధన్ (దేశమంతటా సెలవు)
- 13 ఆగస్టు – రెండవ శనివారం
- 14 ఆగస్టు- ఆదివారం
- 15 ఆగస్టు – స్వాతంత్ర్య దినోత్సవం
- 16 ఆగస్టు – పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్‌పూర్‌లలో సెలవు)
- 18 ఆగస్టు – శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి
- 19 ఆగస్ట్ : శ్రావణ వద్/కృష్ణ జయంతి
- 21 ఆగస్టు – ఆదివారం
- 28 ఆగస్టు -ఆదివారం
- 29 ఆగస్టు- శ్రీమంత శంకరదేవుని తిథి
- 31 ఆగస్టు 2022 – వినాయక చవితి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి