AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2023: బంగారం కొనాలంటే ఇవే మంచి రోజులు! ఏకంగా 25శాతం వరకూ తగ్గింపు.. అదనపు క్యాష్ బ్యాక్‌లు కూడా.. పూర్తి వివరాలు ఇవి..

ధన త్రయోదశి కూడా కలిసి రావడంతో అందరూ బంగారంపై కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీనిని అవకాశంగా మార్చుకుంటున్న జ్యువెలరీ వ్యాపారులు, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. పలు ఆఫర్లు ప్రకటించి సేల్స్ పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటాయి. ఈ ఏడాది కూడా ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా అనేక ఆభరణాల దుకాణాలు ఆఫర్‌లు, తగ్గింపులను అందిస్తున్నాయి.

Dhanteras 2023: బంగారం కొనాలంటే ఇవే మంచి రోజులు! ఏకంగా 25శాతం వరకూ తగ్గింపు.. అదనపు క్యాష్ బ్యాక్‌లు కూడా.. పూర్తి వివరాలు ఇవి..
Gold Jewellery
Madhu
| Edited By: |

Updated on: Nov 11, 2023 | 10:30 PM

Share

దీపావళి అనేది ఐదు రోజుల పండుగ. ధన త్రయోదశితో ఈ పండుగ ప్రారంమవుతుంది. ఈ ఏడాది ధనత్రయోదశి శుక్రవారం అంటే పదో తేదీన ప్రారంభమవుతోంది. ఈ పవిత్రమైన రోజున ప్రజలు లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని ఆరాధిస్తారు. ఇదే సమయంలో ప్రజలు బంగారం, వెండి, వజ్రాల వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. దీనిని కూడా ఓ పవిత్ర కార్యక్రమంలాగానే చాలా మంది భావిస్తారు. ఆ సమయంలో బంగారం కొంటే కలిసి వస్తుందని వారి నమ్మిక. పైగా బంగారానికి మన సంప్రదాయంలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. శుభకార్యమైనా, ఏ పండుగైనా బంగారం కొనుగోలుకు మన వాళ్లు ప్రాధాన్యం ఇస్తారు. పైగా ధన త్రయోదశి కూడా కలిసి రావడంతో అందరూ బంగారంపై కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీనిని అవకాశంగా మార్చుకుంటున్న జ్యువెలరీ వ్యాపారులు, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. పలు ఆఫర్లు ప్రకటించి సేల్స్ పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటాయి. ఈ ఏడాది కూడా ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా అనేక ఆభరణాల దుకాణాలు ఆఫర్‌లు, తగ్గింపులను అందిస్తున్నాయి. జోయాలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్, మెలోర్రా, తనిష్క్, క్యారెట్ లేన్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి టాప్ జ్యూవెలరీ వ్యాపారస్తులు అనేక ఆఫర్లు, బ్యాంక్ క్యాష్ బ్యాక్ లను అందిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..

జోయాలుక్కాస్.. ప్రఖ్యాత బ్రాండ్ జోయాలుక్కాస్ డైమండ్ కొనుగోళ్లపై 25 శాతం వరకు ఆఫర్ చేస్తోంది. వజ్రాలు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే మీకు ఇదే బెస్ట్ ఆప్షన్.

కల్యాణ్ జ్యువెలర్స్.. దీనిలో ద్వారా క్యాండర్ డైమండ్ స్టోన్ ధరపై ఫ్లాట్ 20 శాతం తగ్గింపుతో పాటు అన్ని ప్రధాన బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై 3 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మెలోర్రా.. బంగారు ఆభరణాల తయారీ ఖర్చులపై 25 శాతం వరకు తగ్గింపు, డైమండ్ ఉత్పత్తి విలువలో 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాక ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, వన్ కార్డ్ వంటి క్రెడిట్ కార్డులను వినియోగించి కొనుగోళ్లు చేస్తే 7.5శాతం తక్షణ తగ్గింపును అందిస్తారు.

తనిష్క్.. ఈ జ్యూవెలర్స్ బంగారం, వజ్రాభరణాలపై 20 శాతం వరకు తయారీ ఖర్చులను అందిస్తోంది. అదనంగా, కంపెనీ ఏదైనా ఆభరణాల నుంచి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100 శాతం మార్పిడి విలువను అందిస్తుంది. ఎస్బీఐ కార్డ్ సభ్యుల కోసం, భారతీయ ఆభరణాల సంస్థ కనీసం రూ. 80,000 కొనుగోలుపై రూ.4,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఇది కార్డ్‌కి ఒక లావాదేవీకి మంచిది. నవంబర్ 12, 2023 వరకు ఇది చెల్లుబాటు అవుతుంది.

క్యారెట్ లేన్.. కంపెనీ 4,000 లేదా అంతకంటే ఎక్కువ వజ్రాల కొనుగోళ్లపై ఫ్లాట్ 25 శాతం తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా, ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు 5 శాతం తక్షణ తగ్గింపును అందుకుంటారు. ఈ ఆఫర్ నవంబర్ 12, 2023 వరకు అందుబాటులో ఉంటుంది.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. ఈ కంపెనీ ప్రతి రూ. 30,000 బంగారు ఆభరణాల కొనుగోలుతో 100ఎంజీ బంగారు నాణేన్ని అందజేస్తోంది. అంతేకాక వజ్రాల విలువలు, రత్నం, పోల్కీ ఆభరణాల ధరలపై 30 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తుంది. ఈ తగ్గింపులు నవంబర్ 19, 2023 వరకు అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు రూ. 25,000 కనీస లావాదేవీలపై 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంటే గరిష్ట క్యాష్ బ్యాక్ రూ. 2,500 అవుతుంది. ఈ ఆఫర్ కూడా నవంబర్ 12, 2023 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..