Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royal Enfield Electric Bike: హిమాలయాల్లోనూ ప్రయాణించగలిగే మోటార్ సైకిల్.. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చేస్తోంది..

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ బైక్ రాయల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటలీ మిలాన్ లో జరిగిన ఈఐసీఎంఏ లో దీని ప్రోటోటైప్ రివీల్ చేశారు. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీకి ఈ బైక్ నాంది పలికింది. భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు తీసుకొచ్చేలా ఈ బైక్ మార్గం చూపనుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 ఎలక్ట్రిక్.

Royal Enfield Electric Bike: హిమాలయాల్లోనూ ప్రయాణించగలిగే మోటార్ సైకిల్.. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చేస్తోంది..
Royal Enfield Himalayan 450
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 12, 2023 | 9:40 PM

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ బైక్ రాయల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటలీ మిలాన్ లో జరిగిన ఈఐసీఎంఏ లో దీని ప్రోటోటైప్ రివీల్ చేశారు. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీకి ఈ బైక్ నాంది పలికింది. భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు తీసుకొచ్చేలా ఈ బైక్ మార్గం చూపనుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 ఎలక్ట్రిక్. ఇది కొండలు, గుట్టలు, మంచ కొండల వంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎంచక్కా ప్రయాణించగలిగేలా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ హిమాలయన్..

లెజెండరీ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ రోడ్లపై పరుగుపెట్టేందుకు సిద్ధమైంది. రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 పేరుతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ప్రోటో టైప్ ను ఇటలీలో జరిగిన ఈఐసీఎంఏ ప్రదర్శించింది ఆ కంపెనీ. అయితే ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే. అయితే ఈ టూ వీలర్ కు సంబంధించిన చిత్రాలు కొన్ని వచ్చాయి. ఇది చూడటానికి కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రయాణింగలిగే షార్ప్ అండ్ స్లీక్ డిజైన్ ను కలిగి ఉంది. దీని సాయంతో సాహస ప్రయాణాలు సులభంగా చేయొచ్చు. సుదూర ప్రాంతాల యాత్రికులకు సరిగ్గా సరిపోతుంది. ఈ బైక్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇంకా కంపెనీ ప్రకటించలేదు. అయితే ఇది ఏడీవీ డిజైన్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ బైక్ రాబోయే సంవత్సరాల్లో విడుదలకు షెడ్యూల్ అయిన పూర్తి ఫంక్షనల్ ప్రోటోటైప్ మాత్రమే.

రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ బి గోవిందరాజన్ మాట్లాడుతూ తమ ఎలక్ట్రిక్ మొబిలిటీ టీమ్ అత్యుత్తమ రాయల్ ఎన్‌ఫీల్డ్ డీఎన్ఏని సంరక్షిస్తూనే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం సృజనాత్మకంగా ఆలోచనలు చేసినట్లు చెప్పారు. డిజైన్లో కొన్ని మార్పులు తీసుకొచ్చినా. ఎన్ఫీల్డ్ ఆకారం, దాని బ్రాండ్ ఇమేజ్ తగినట్లుగానే బైక్ ఉంటుందని పేర్కొన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మారియో అల్విసి ఎలక్ట్రిక్ హిమాలయన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఇది కేవలం ఓ శ్యాంపిల్ మాత్రమేనని, తమ విజన్ కి వినియోగదారులు తమ ఏమి ఊహించవచ్చో తెలిపే చిన్న గ్లింప్స్ మాత్రమే నని చెప్పారు.

ఇవి కూడా చదవండి

బైక్ పనితీరు..

రాయల్ ఎన్ఫీల్డ్ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ రైడర్, పర్యావరణం రెండింటిపై ఒత్తిడిని తగ్గించడంతోపాటు అన్వేషణను ప్రోత్సహించే కాన్సెప్ట్‌ను రూపొందించడం కంపెనీ డిజైన్ బృందం ప్రాథమిక లక్ష్యం. ఫలితంగా, వారు కొత్త బ్యాటరీ బాక్స్ ను తయారు చేస్తున్నట్లు చెప్పింది. దీనికోసం కొత్త ఉత్పాదక డిజైన్ పద్ధతులను అమలు చేశామని, మోటార్‌సైకిల్ బాడీవర్క్ కోసం ఆర్గానిక్ ఫ్లాక్స్ ఫైబర్ కాంపోజిట్ వంటి వినూత్న పదార్థాలను ప్రవేశపెట్టామని పేర్కొంది . రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక లక్ష్యం మోటార్ సైకిల్‌లో ప్యాక్ చేయగల బ్యాటరీల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టడం కాదు. బదులుగా, వారి లక్ష్యం రైడర్‌లకు అన్వేషణ అనుభవాన్ని మెరుగుపరచడం, హిమాలయాల శబ్దాలను వినడానికి వీలు కల్పించడం. ఇంకా దీనికి సంబధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, అయితే హిమాలయన్ ఎలక్ట్రిక్ త్వరలో ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..