Business Idea: ఈ వ్యాపారం చేస్తే అసలు నష్టం అనేదే ఉండదు.. పెట్టుబడి కూడా తక్కువే..
భారతదేశంలో మసాలాలు, మసాలా దినుసులకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ రోజూ వంటింట్లో ఉపయోగించే మసాలాల వ్యాపారం చేస్తే అసలు నష్టం అనేదే ఉండదు. అంతేకాకుండా తక్కువ పెట్టుబడితో ప్రారంభించే అవకాశం ఉన్న ఈ బిజినెస్‌తో మంచి లాభాలను సైతం ఆర్జించవచ్చు. మసాలా తయారీ యూనిట్ ప్రారంభించడానికి ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు...
ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటారు. అందుకే వచ్చే జీతంలో కొంతైనా వ్యాపారం కోసం సేవింగ్స్ చేస్తుంటారు. ఇక చాలా మంది వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుందన్న భయంతో బిజినెస్‌లోకి ఎంటర్ కావడానికి భయపడుతుంటారు. అయితే మార్కెట్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చు. అలాంటి బెస్ట్ బిజినెస్ ప్లాన్స్‌లో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో మసాలాలు, మసాలా దినుసులకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ రోజూ వంటింట్లో ఉపయోగించే మసాలాల వ్యాపారం చేస్తే అసలు నష్టం అనేదే ఉండదు. అంతేకాకుండా తక్కువ పెట్టుబడితో ప్రారంభించే అవకాశం ఉన్న ఈ బిజినెస్‌తో మంచి లాభాలను సైతం ఆర్జించవచ్చు. మసాలా తయారీ యూనిట్ ప్రారంభించడానికి ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నిత్యం ఆదాయం పొందొచ్చు. సుంగధ ద్రవ్యాలకు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవచ్చు.
ఇందుకోసం పెద్దగా స్థలం కూడా అవసరం లేదు ఇంట్లోనే ఓ గది ఉంటే చాలు. సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ. 3.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు. 300 చదరపు అడుగుల ఓ గదితో పాటు ముడి సరకులు ఉంటే చాలు. ఇక పెట్టుబడి కోసం కూడా టెన్షన్ పడాల్సిన పనిలేదు. బ్యాంకులు సైతం లోన్స్ ఇస్తాయి. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద లోన్ పొందొచ్చు. అంతేకాకుండా ముద్రలోన్ ద్వారా కూడా రుణం తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
ఈ బిజినెస్ ద్వారా ఏటా సుమారు 193 క్వింటాళ్ల మసాలా పదార్థాలను ఉత్పత్తి చేయొచ్చు. ఇలా తక్కువలో తక్కువ నెలకు రూ. 30 వేలకిపైగా సంపాదించొచచు. ఇక మసాలాను తయారు చేసిన తర్వాత దానిని మార్కెటింగ్ చేసుకోగలగాలి. దుకాణాలకు నేరుగా తిరుగుతూ మీరే సొంతంగా ప్రమోషన్ చేసుకోవచ్చు. సొంత బ్రాండ్‌తో కూడా ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు. ప్రస్తుతం ఈ కామర్స్ సైట్స్‌లో కూడా విక్రయించుకునే వెసులుబాటు ఉంది కాబట్టి, మీరే సొంతంగా అమ్ముకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..