Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: జనరల్‌ టికెట్ కోసం లైన్‌లో నిలబడాల్సిన పనిలేదు.. ఆన్‌లైన్‌లోనే..

అయితే ఇండియన్‌ రైల్వే దీనిని నిజం చేసింది. ఇకపై జనరల్ టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రైల్వే శాఖ తీసుకొచ్చిన యూటీఎస్‌ యాప్‌ ద్వారా స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే జనరల్ టికెట్‌ను సైతం బుక్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ యాప్‌ను రైల్వే అధికారులు చాలా రోజుల క్రితమే తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ చాలా మంది ఈ యాప్‌పై అవగాహన లేకపోవడంతో..

Indian Railway: జనరల్‌ టికెట్ కోసం లైన్‌లో నిలబడాల్సిన పనిలేదు.. ఆన్‌లైన్‌లోనే..
Indian Railway
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 11, 2023 | 9:18 PM

రైళ్లలో తక్కువ దూరం ప్రయాణం చేయాలనుకుంటే రైల్వే స్టేషన్‌లోనే టికెట్లను బుక్‌ చేసుకోవాలి. కేవలం రిజర్వేషన్ టికెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుందనే విషయం తెలిసిందే. జనరల్ టికెట్స్‌ను కచ్చితంగా స్టేషన్‌కు వెళ్లి, లైన్‌లో నిలబడి తీసుకోవాలి. అయితే జనరల్ టికెట్స్‌ను కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.?

అయితే ఇండియన్‌ రైల్వే దీనిని నిజం చేసింది. ఇకపై జనరల్ టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రైల్వే శాఖ తీసుకొచ్చిన యూటీఎస్‌ యాప్‌ ద్వారా స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే జనరల్ టికెట్‌ను సైతం బుక్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ యాప్‌ను రైల్వే అధికారులు చాలా రోజుల క్రితమే తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ చాలా మంది ఈ యాప్‌పై అవగాహన లేకపోవడంతో ఇంకా లైన్‌లో నిలబడి టికెట్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇంతకీ ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.? యాప్‌ ద్వారా టికెట్‌ను ఎలా బుక్‌ చేసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

కేవలం జనరల్ టికెట్లు మాత్రమే కాకుండా ప్లాట్‌ ఫార్‌ టికెట్లు, సీజన్‌ టికెట్స్‌ను సైతం ఈ యాప్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం ముందు మీ స్మార్ట్ ఫోన్‌లోని ప్లే స్టోర్‌లోకి వెళ్లాలి. అనంతరం యూటీఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం మీ పేరు, ఫోన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ వంటి వివరాలతో యాప్‌లో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ పూర్తవుతుంది.

అనంతరం మీ ఫోన్‌ నెంబర్‌, ఎంచుకున్న పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా యాప్‌లోకి లాగిన్‌ కావాలి. ఓపెన్‌కాగానే యాప్‌లో టికెట్ క్యాటగిరీలు కనిపిస్తాయి ఇందులో నార్మల్ బుకింగ్ ఆప్షన్‌లో జనరల్ టికెట్లు, సీజన్ టికెట్లు, ఫ్లాట్‌ఫామ్ టికెట్ల ఆప్షన్స్‌ కనిపిస్తాయి. మీకు కావాల్సిన క్యాటగిరీని ఎంచుకోవాలి. జనరలల్‌ కేటగిరీని సెలక్ట్ చేసకోవాలి. అనంతరం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు, ఎంత మంది ప్రయాణిస్తున్నారు సెలక్ట్ చేసుకోవాలి.

చిన్న పిల్లలు ఉంటే వారి వివరాలను కూడా నమోదు చేయాలి. అనంతరం క్యాష్ పేమెంట్‌ ఆప్షన్‌ వస్తుంది. ఇందులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు డిజిటల్‌ పేమెంట్స్‌తో పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ పూర్తికాగానే టికెట్ కొనుగోలు పూర్తయినట్లే. అయితే మీరు ఏరోజు ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ రోజు టికెట్ బుక్ చేసుకుంటేనే వర్తిస్తుంది. ముందు రోజు టికెట్ బుక్‌ చేసుకుంటే చెల్లదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్