AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Ticket Booking: ఏ సమయంలోనైనా మీ ట్రైన్ టిక్కెట్ కన్‌ఫామ్.. బుక్ చేసే సమయంలో ఆ పని చేయాల్సిందే..!

భారతదేశంలోని ప్రజలకు దూర ప్రాంత ప్రయాణాలు భారతీయ రైల్వేలు టక్కున గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బడ్జెట్‌లోనే దూర ప్రాంతాలకు ట్రావెల్ చేయాలనుకునే వారికి రైల్వే ప్రయాణం అనువుగా ఉంటుంది. అయితే ప్రస్తుత పండుగ సీజన్‌లో రైలు ప్రయాణం అంటే చాలా మంది భయపడే పరిస్థితి ఉంటుంది. రిజర్వేషన్, వెయిటింగ్ లిస్ట్‌ల వంటి ఆందోళనల నేపథ్యంలో ఈ సమయంలో రైలు ప్రయాణం అంటే సామాన్యులు వెనుకంజ వేస్తున్నారు. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో తీసుకునే ఒక్క జాగ్రత్త వల్ల ఎలాంటి సమయంలోనైనా మీ టిక్కెట్ కన్‌ఫామ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Train Ticket Booking: ఏ సమయంలోనైనా మీ ట్రైన్ టిక్కెట్ కన్‌ఫామ్.. బుక్ చేసే సమయంలో ఆ పని చేయాల్సిందే..!
Nikhil
|

Updated on: Oct 03, 2024 | 8:29 PM

Share

భారతదేశంలోని ప్రజలకు దూర ప్రాంత ప్రయాణాలు భారతీయ రైల్వేలు టక్కున గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బడ్జెట్‌లోనే దూర ప్రాంతాలకు ట్రావెల్ చేయాలనుకునే వారికి రైల్వే ప్రయాణం అనువుగా ఉంటుంది. అయితే ప్రస్తుత పండుగ సీజన్‌లో రైలు ప్రయాణం అంటే చాలా మంది భయపడే పరిస్థితి ఉంటుంది. రిజర్వేషన్, వెయిటింగ్ లిస్ట్‌ల వంటి ఆందోళనల నేపథ్యంలో ఈ సమయంలో రైలు ప్రయాణం అంటే సామాన్యులు వెనుకంజ వేస్తున్నారు. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో తీసుకునే ఒక్క జాగ్రత్త వల్ల ఎలాంటి సమయంలోనైనా మీ టిక్కెట్ కన్‌ఫామ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విజయదశమి, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సమయంలో రైలు టిక్కెట్‌ను పొందడం చాలా కష్టం. అయితే  ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు నిర్ధారిత సీట్లు పొందేలా చూసేందుకు భారతీయ రైల్వేలు రిజర్వేషన్ విధానాల్లో అనేక మార్పులు చేసింది. తద్వారా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో టిక్కెట్‌ బుకింగ్‌ విషయంలో అందుబాటులో ఉన్న వికలాప్ యోజన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రైల్వే శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మరిన్ని కన్ఫర్మ్ టిక్కెట్లను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అదనంగా రైల్వే శాఖ వికలాప్ యోజన అనే ప్రత్యామ్నాయ రైలు వసతి పథకాన్ని (ఏటీఏఎస్) ప్రవేశపెట్టాయి. ముఖ్యంగా రైళ్ల రద్దీ సమయంలో వికలాప్‌ టిక్కెట్ రిజర్వేషన్ ఎంపికను ఉపయోగిస్తే మనం బుక్‌ చేసుకున్న రైలులో టిక్కెట్‌ అందుబాటులో లేకపోతే తర్వాత వచ్చే ట్రైన్స్‌లో ఖాళీ ఉంటే టిక్కెట్‌ కన్‌ఫామ్‌ అవుతుంది. రైల్వే శాఖ సాధారణంగా ప్రయాణ తేదీకి 120 రోజుల ముందు టిక్కెట్ల బుకింగ్‌ను అనుమతిస్తుంది. అయితే ముందుగా ప్లాన్‌ చేసుకుని ప్రయాణించే వారికి టిక్కెట్స్‌ దొరుకుతున్నా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు కూడా తత్కాల్ సౌకర్యాన్ని ఉపయోగించి ప్రయాణానికి ఒక రోజు ముందు టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే టిక్కెట్‌ కన్‌ఫామ్‌ అవుతుందనే ఉద్దేశంతో టిక్కెట్లను బుక్‌ చేసుకునే వాళ్లు వికలాప్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

రైల్వేలు ప్రత్యామ్నాయ రైలు వసతి (ఏటీఏఎస్‌) పథకానికి వికలాప్‌ అని పేరు పెట్టాయి. ఈ పథకంలో భాగంగా ప్రయాణికులకు వీలైనంత ఎక్కువగా కన్‌ఫామ్‌ టిక్కెట్లను అందిస్తారు. టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఆటోమెటిక్‌గా వికలాప్‌ ఎంపిక కనిపిస్తుంది. దీన్ని మీరు ఎంచుకుంటే మీరు ప్రయాణించాలనుకున్న రైలుకు వెయిటింగ్ టికెట్ ఉంటే ఆ మార్గంలో ఇతర రైళ్లను ఎంచుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రత్యామ్నాయ రైలులో సీటు లేదా కూచెట్ అందుబాటులో ఉంటే ఆ రైలులో మీకు ఆటోమేటిక్‌గా సీటు కేటాయిస్తారు. మీరు బుక్ చేసిన టిక్కెట్‌ల హిస్టరీను సందర్శించడం ద్వారా మీరు ఈ ఎంపిక స్థితిని తనిఖీ చేయవచ్చు. వికలాప్‌ ప్రోగ్రామ్ కింద ప్రయాణికులు బోర్డింగ్ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి 30 నిమిషాల నుండి 72 గంటలలోపు నడపాల్సిన 7 రైళ్లను ఎంచుకోవచ్చు. ఈ ఎంపికను ఎంచుకోవడం వల్ల మీరు కచ్చితంగా కనఫామ్‌ టిక్కెట్‌ను పొందరు. అయితే మీ టిక్కెట్‌ కనఫర్మేషన్‌ స్టేటస్‌ అనేది మీరు ఎంచుకున్న రైళ్లలో సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..