Business Idea: ట్రెండ్ ఫాలో అవ్వండి బ్రో.. కూర్చున్న చోటే లక్షల్లో సంపాదించొచ్చు
ప్రస్తుతం వీడియో గేమ్స్‌కు అర్థం మారి పోయింది. కంప్యూటర్లు, ఫోన్‌లలో గేమ్స్ ఆడుతోన్న తరుణంలో వీఆర్ గేమింగ్ ప్రాముఖ్యత పెరుగుతోంది. రియల్ టైమ్‌లో గేమ్స్ ఆడుతున్న అనుభూతి కలిగేలా ఈ వీఆర్ గేమింగ్ జోన్స్‌ను డిజైన్ చేశారు. ఇప్పుడీ గేమింగ్ జోన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. మున్సిపాలిటీ లాంటి రేంజ్ ఉన్న పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు...
మారిన కాలంతో పాటు మారితేనే సమాజంలో నెగ్గుకురాగలం అని తెలిసిందే. అది వ్యాపారానికి కూడా వర్తిస్తుంది. మూస పద్ధతిలో వ్యాపారాలు చేస్తామంటే కుదరదు. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి ఒక ట్రెండీ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం వీడియో గేమ్స్‌కు అర్థం మారి పోయింది. కంప్యూటర్లు, ఫోన్‌లలో గేమ్స్ ఆడుతోన్న తరుణంలో వీఆర్ గేమింగ్ ప్రాముఖ్యత పెరుగుతోంది. రియల్ టైమ్‌లో గేమ్స్ ఆడుతున్న అనుభూతి కలిగేలా ఈ వీఆర్ గేమింగ్ జోన్స్‌ను డిజైన్ చేశారు. ఇప్పుడీ గేమింగ్ జోన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. మున్సిపాలిటీ లాంటి రేంజ్ ఉన్న పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ఏంటీ వీఆర్ గేమింగ్ జోన్.? ఈ వ్యాపారంలో లాభాలు ఎలా ఉంటాయి.? పెట్టుబడి ఎంత అవుతుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వర్చువల్ రియాలిటీ గేమ్ జోన్ ఏర్పాటు చేయడానికి ఒక పెద్ద గది ఉండే షటర్‌ను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీఆర్ సెట్స్ అవసరపడతాయి. ప్రముఖ టెక్ దిగ్గజం మెటాకు చెందిన వీఆర్ హెడ్‌సెట్స్ ప్రారంభ ధరలు రూ. 33 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. గేమ్స్‌ను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొదట ఒక మూడు వీఆర్ సెట్స్‌తో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వీటితో పాటు కారు గేమ్స్ ఆడ్డానికి స్టీరింగ్స్, ప్లే స్టేషన్స్ టూల్స్‌ను కొనుగోలు చేయాలి. అలాగే ఆండ్రాయిడ్ టీవీలను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మొత్తం మీద ఒక రూ. 2 లక్షలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభాల విషయానికొస్తే వీఆర్ గేమింగ్స్‌కు ప్రస్తుతం సాధారణంగా గంటకు రూ. 200 వరకు వసూలు చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 100తో కూడా ప్రారంభించవచ్చు. ఇలా రోజుకు మూడు సెట్స్ మూడు గంటల చొప్పున రన్ అయినా రూ. 1800 వరకు పొందొచ్చు. వీటితో పాటు మీరు ఎంపిక చేసిన గేమ్స్‌కు వేరు వేరుగా ఛార్జీలు ఉంటాయి. పబ్లిసిటీ చేసుకుంటే భారీగా లాభాలు పొందొచ్చు. గేమింగ్ జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని వస్తువులు ఆన్‌లైన్‌లోనే లభిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..