కార్ లాంటి ఫీచర్లతో కొత్త స్కూటర్.. యమహా నుంచి అప్ గ్రేడెడ్ వెర్షన్ వచ్చేసింది.

Yamaha RayZR Street Rally:యమహా రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ అప్ గ్రేడెడ్ వెర్షన్లో కొత్తగా 'ఆన్సర్ బ్యాక్' ఫంక్షన్ వస్తుంది. అంటే కార్ లో ఉండే ఫీచర్ లాంటిదన్నమాట. ఈ ఫీచర్ మొబైల్ యాప్లోని 'ఆన్సర్ బ్యాక్' బటన్ను క్లిక్ చేయడం ద్వారా పనిచేస్తుంది. మీరు బండిని ఎక్కడైనా పార్క్ చేసిన సమయంలో, అక్కడ రద్దీగా ఉంటే మన బండి ఎక్కడుందే వెతుక్కుంటూ ఉంటాం.. ఆ సమయంలో ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది.

కార్ లాంటి ఫీచర్లతో కొత్త స్కూటర్.. యమహా నుంచి అప్ గ్రేడెడ్ వెర్షన్ వచ్చేసింది.
Yamaha Rayzr Street Rally
Follow us
Madhu

|

Updated on: Sep 24, 2024 | 2:41 PM

యమహా బ్రాండ్ ద్విచక్ర వాహనాలకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండే ఉంది. పాత కాలపు ఆర్ ఎక్స్ 100 ఇప్పటి ఆర్15 వరకూ బ్రాండ్ వ్యాల్యూ ఏమాత్రం తగ్గలేదు. ఈ కంపెనీ నుంచి కొన్ని స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లోరే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఒకటి. దీనిని ఇప్పుడు అప్ గ్రేడ్ చేసి మార్కెట్లోకి రీలాంచ్ చేసింది జపాన్ కు చెందిన ఈ ద్విచక్ర వాహన తయారీదారు యమహా. దీనిలో ప్రత్యేకమైన ఫీచర్లను జోడించింది. వాటిల్లో ‘ఆన్సర్ బ్యాక్’ ఫంక్షన్, ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్(డీఆర్ఎల్) వంటివి ఉన్నాయి. దీని ధర రూ. 98,130 ఎక్స్ షోరూంగా ఉంది. ఈ స్కూటర్ ప్రస్తుతం ఉన్న కలర్ ఆప్షన్లతో పాటు కొత్త సైబర్ గ్రీన్ కలర్, మ్యాటే బ్లాక్ ఐస్ ఫ్లో వెర్మిలన్ లలో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్ అంటే..

యమహా రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ అప్ గ్రేడెడ్ వెర్షన్లో కొత్తగా ‘ఆన్సర్ బ్యాక్’ ఫంక్షన్ వస్తుంది. అంటే కార్ లో ఉండే ఫీచర్ లాంటిదన్నమాట. ఈ ఫీచర్ మొబైల్ యాప్లోని ‘ఆన్సర్ బ్యాక్’ బటన్ను క్లిక్ చేయడం ద్వారా పనిచేస్తుంది. మీరు బండిని ఎక్కడైనా పార్క్ చేసిన సమయంలో, అక్కడ రద్దీగా ఉంటే మన బండి ఎక్కడుందే వెతుక్కుంటూ ఉంటాం.. ఆ సమయంలో ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. యాప్ లో ఆన్సర్ బ్యాక్ బటన్ పై క్లిక్ చేయగానే స్కూటర్ ఫ్లాషింగ్ బ్లింకర్లు వెలుగుతాయి. అంతేకాక బజర్ నుంచి బీప్ సౌండ్లతో ప్రతిస్పందిస్తుంది.

అంతేకాకుండా యమహా రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఇప్పుడు ఎల్ఈడీ డీఆర్ఎల్ లను కలిగి ఉంది. స్కూటర్ డ్యూయల్-టోన్ సీట్ డిజైన్ ను కలిగి ఉంది. దాని రెండు-స్థాయి సీటింగ్ను పూర్తి చేస్తుంది. అప్ గ్రేడెడ్ వేరియంట్లో రిఫ్రెష్ చేసిన స్టైలింగ్ అంశాలు ఉన్నాయి. యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఈషిన్ చిహానా మాట్లాడుతూ రేజెస్ఆర్ స్ట్రీట్ ర్యాలీలోని తాజా మెరుగుదలలు యమహా ఆవిష్కరణ, శ్రేష్టత పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తాయన్నారు. అదే సమయంలో కస్టమర్లకు మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.

యమహా రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్పెక్స్, ఫీచర్లు..

యమహా రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125సీసీ ఎఫ్ఐ బ్లూ కోర్ ఇంజిన్ ఉంటుంది. మెరుగైన పనితీరు, సామర్థ్యం కోసం హైబ్రిడ్ పవర్ అసిస్ట్ ఉన్నాయి. ఎయిర్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్ట్ చేసిన ఇంజిన్ స్మార్ట్ మోటార్ జనరేటర్ (ఎస్ఎంజీ)తో జత చేసి ఉంటుంది. ఇది వేగంగా, సులభంగా నిశ్శబ్దంగా బండి స్టార్ట్ అయ్యేందుకు ఉపకరిస్తుంది. ఇది బ్రష్ గార్డ్, సొగసైన మెటల్ ప్లేట్లు, ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్లాక్ ప్యాటర్న్ టైర్లను పొందుతుంది. యమహా రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీలో సీటు కింద 21 లీటర్ల స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ స్విచ్, ఆటోమేటిక్ స్టాప్-అండ్-స్టార్ట్ సిస్టమ్, వై-కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..