Bank Deposits: దేశంలోని బ్యాంకుల్లో మగ్గుతున్న రూ.78 వేల కోట్లు.. ఈ డిపాజిట్లు ఎవరివి?

దేశంలోని బ్యాంకుల్లో 78 వేల కోట్ల రూపాయలు మగ్గుతున్నాయి. ఇంత మొత్తంలో బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లు ఎవరికి చెందినవో తెలుసుకునేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. దీంతో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వాపసును వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి సాంకేతికంగా..

Bank Deposits: దేశంలోని బ్యాంకుల్లో మగ్గుతున్న రూ.78 వేల కోట్లు.. ఈ డిపాజిట్లు ఎవరివి?
Follow us
Subhash Goud

|

Updated on: Sep 24, 2024 | 2:38 PM

దేశంలోని బ్యాంకుల్లో 78 వేల కోట్ల రూపాయలు మగ్గుతున్నాయి. ఇంత మొత్తంలో బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లు ఎవరికి చెందినవో తెలుసుకునేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. దీంతో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వాపసును వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి సాంకేతికంగా చర్యలు చేపడుతోంది. క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరగడాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 2024 నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌లో రూ.78,213 కోట్ల అన్‌క్లెయిమ్ చేసిన డిపాజిట్లు ఉన్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 26% ఎక్కువ. అయితే వేల కోట్ల రూపాయలు ఎవరివో తెలుసుకునేందుకు బ్యాంకులకు తలనొప్పిగా మారింది.

సహకార బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలుగా గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకుల ద్వారా సవివరమైన అధ్యయనం జరుగుతోందని, ఇందులో అన్ క్లెయిమ్ చేయని డిపాజిట్లను విశ్లేషించి, డిపాజిట్లను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఆర్బీఐ.

ఇది కూడా చదవండి: Bank Account: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా? వెంటనే ఈ పని చేయండి.. లేకుంటే అకౌంట్‌ క్లోజ్‌!

ఇవి కూడా చదవండి

డిపాజిటర్లతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి, క్లెయిమ్‌ల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి సాంకేతికత ఆధారిత పరిష్కారాలు, డిజిటల్ సాధనాలను ఉపయోగించడంపై అధ్యయనం దృష్టి పెడుతుంది. ఈ దిశలో బ్యాంకులు క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, రాష్ట్రాలను కూడా గుర్తిస్తాయి. అలాగే ఇందుకోసం స్థానిక స్థాయిలో చర్యలు చేపడుడుతున్నాయి బ్యాంకులు.

ఈ సమస్యపై ఆగస్ట్ 2023లో బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024 ద్వారా ప్రతి బ్యాంకు ఖాతాలో నామినీల సంఖ్యను ఒకటి నుండి నాలుగుకు పెంచడానికి ప్రభుత్వం అనుమతించింది. తద్వారా క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అన్ని ఆర్థిక రంగాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు, క్లెయిమ్‌ల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను అమలు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక నియంత్రణ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. కస్టమర్లు తమ వారసులను నామినేట్ చేసేలా ప్రోత్సహించాలని, తద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయని డబ్బు సమస్యను తగ్గించవచ్చని ఆమె సంస్థలను కోరారు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ గురించి 10 ఆసక్తికర విషయాలు.. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆర్బీఐ ఈ దిశలో UDGAM పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. ఇది ప్రజలు తమ అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి సమాచారాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. 2023లో ఆర్బీఐ బ్యాంకుల కోసం ‘100 రోజుల్లో 100 చెల్లింపులు’ కార్యక్రమంతో ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. దీని కింద 100 రోజులలోపు క్లెయిమ్ చేయని టాప్ 100 డిపాజిట్లను సెటిల్ చేయడానికి బ్యాంకులు చర్యలు చేపడుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి