Business Idea: ఇది కదా అసలైన వ్యాపారం అంటే.. పక్కాగా లక్షల్లో ఆదాయం
ప్రస్తుతం మార్కెట్లో అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్‌కి మంచి డిమాండ్ ఉంది. పానిపూరి బండి నుంచి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వరకు ప్రతీ చోట వీటి ఉపయోగం భారీగా పెరిగింది. ప్లాస్టిక్‌పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తున్న తరుణంలో వీటికి మంచి డిమాండ్ పెరిగింది. ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్ తయారీని ప్రారంభిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు...
బిజినెస్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఐఐటీ వంటి దిగ్గజ సంస్థల్లో చదివిన వారు కూడా సొంతంగా వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వినూత్నంగా ఆలోచిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. తాము సంపాదన ఆర్జిస్తూనే మరోవైపు మరో నలుగురికి సైతం ఉపాధి కల్పిస్తున్నారు. అయితే కొందరు పెట్టుబడికి భయపడి, లాభాలు వస్తాయో రావో అన్న అనుమానంతో వెనుకడుగు వేస్తుంటారు. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే నష్టమనే మాటే ఉండదు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం మార్కెట్లో అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్‌కి మంచి డిమాండ్ ఉంది. పానిపూరి బండి నుంచి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వరకు ప్రతీ చోట వీటి ఉపయోగం భారీగా పెరిగింది. ప్లాస్టిక్‌పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తున్న తరుణంలో వీటికి మంచి డిమాండ్ పెరిగింది. ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్ తయారీని ప్రారంభిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఇంతకీ వీటిని ఎలా తయారు చేస్తారు.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అల్యూమినియం ఫాయిల్‌తో తయారు చేసిన కంటైనర్స్‌లో ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండడమే వీటి డిమాండ్‌కు కారణంగా చెప్పొచ్చు. ఈ కంటైనర్ తయారీకి రెండు రకాల మిషిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి సెమీ ఆటోమెటిక్ మరొకటి ఫుల్లీ ఆటోమెటిక్ మిషిన్స్. ఇక ముడి సరుకుగా అల్యూమినియం ఫాయిల్ రోల్స్ కావాల్సి ఉంది. ఇవి కేజీ రూ. 150 నుంచి రూ. 200 మధ్య లభిస్తుంది. ఇక కంటైనర్ షేప్ డిజైన్ కోసం మార్కెట్లో విభిన్న రకాల డైస్ అందుబాటులో ఉంటాయి. అల్యూమినియం ఫాయిల్ రోల్‌ను మిషిన్‌లో పెట్టడం వల్ల చాలా వేగంగా కంటైనర్స్ తయారీ అవుతుంటాయి.
ఇక సింగిల్ కావిటీ, డబుల్, ట్రిపుల్ ఇలా మిషిన్స్‌లో రకాలు ఉంటాయి. సింగిల్ కావిటీలో ఒక్కొక్క కంటైనర్ రడీ అయితే డబుల్‌లో ఒకేసారి రెండు కంటైనర్స్ రడీ అవుతాయి. సాధారణంగా సింగిల్ కావిటీ మిషిన్ ద్వారా ఒక నిమిషానికి 40 నుంచి 50 కంటైనర్స్ తయారు చేయొచ్చు. అంటే గంటకు ఏకంగా 3000 వరకు కంటైనర్స్ రడీ అవుతాయి. రోజులో తక్కువలో తక్కు 6 గంటలు పనిచేసినా.. 14 నుంచి 18 వేల కంటైనర్స్‌ను తయారు చేయొచ్చు. ఈ మిషిన్స్ రన్ కావడానికి 3 ఫేస్ కరెంట్ కావాల్సి ఉంటుంది.
ఇక లాభాల విషయానికొస్తే.. 1 అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ తయారు చేయడానికి రూ. 2 ఖర్చవుతుంది. మార్కెట్లో దీనిని రూ. 2.5కు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క కంటైనర్‌పై 50 పైసలు లభిస్తుంది. ఉదాహరణకు రోజుకు 16 వేల కంటైనర్స్ తయారు చేశారనుకుంటే సుమారు రోజుకు రూ. 8 వేల ఆదాయం పొందొచ్చు. ఈ లెక్కన నెలకు ఎంత కాదన్నా రూ. 2 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..