MG Windsor EV: ఎంజీ కొత్త ఈవీ విండ్సర్ ధరలు ఇవే.. మార్కెట్లో ఈ కార్ల నుంచి గట్టి పోటీ..

ఇటీవల ఎలక్ట్రిక్ కార్ ఒకటి లాంచ్ అయ్యింది. దాని పేరు ఎంజీ విండ్సర్ ఈవీ. రూ. 9.99లక్షల(ఎక్స్ షోరూం) ప్రారంభ ధరతో ఇది మార్కెట్లోకి వచ్చింది. అయితే దీనిలో బ్యాటరీ మాత్రం అద్దెకిస్తామని, దాని కోసం ప్రత్యేకంగా ధర చెల్లించాలని కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ ఆ బ్యాటరీతో కలిపి పూర్తి ధరను ప్రకటించింది.

MG Windsor EV: ఎంజీ కొత్త ఈవీ విండ్సర్ ధరలు ఇవే.. మార్కెట్లో ఈ కార్ల నుంచి గట్టి పోటీ..
Mg Windsor Ev
Follow us
Madhu

|

Updated on: Sep 24, 2024 | 3:16 PM

ప్రపంచ దిగ్గజ కార్ల బ్రాండ్లలో మోరిస్ గ్యారేజెస్(ఎంజీ) ఒకటి. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల ఎలక్ట్రిక్ కార్ ఒకటి లాంచ్ అయ్యింది. దాని పేరు ఎంజీ విండ్సర్ ఈవీ. రూ. 9.99లక్షల(ఎక్స్ షోరూం) ప్రారంభ ధరతో ఇది మార్కెట్లోకి వచ్చింది. అయితే దీనిలో బ్యాటరీ మాత్రం అద్దెకిస్తామని, దాని కోసం ప్రత్యేకంగా ధర చెల్లించాలని కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ ఆ బ్యాటరీతో కలిపి పూర్తి ధరను ప్రకటించింది. బ్యాటరీతో కలిపిన ఎంజీ విండ్సర్ ఈవీ కారు ధర రూ. 13.50(ఎక్స్ షోరూం) ఉంటుంది. అంటే ముందు ప్రకటించిన ధరకు దీనికి దాదాపు రూ. 3.51లక్షలు తేడా ఉంది. కాగా ఈ ఎంజీ విండ్సర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్. ఇందులో అత్యధిక ధర కలిగిన వెర్షన్ ధర రూ. 15.50లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంటుంది.

మార్కెట్లో వీటితో పోటీ..

ఎంజీ విడ్సర్ ధరలు వెల్లడి కావడంతో ఇప్పుడు అదే ధరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఈవీల గురించి కూడా చర్చ వస్తుంది. ఈ ధరల శ్రేణితో ఎంజీ విండ్సర్ ఈవీ మార్కెట్లోని టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్ యూవీ400 వంటి వంటి కార్లతో పోటీ పడాల్సి వస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.19.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. మహీంద్రా ఎక్స్ యూవీ400 ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 19.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. నెక్సాన్ ఈవీ రూ. 465 కిమీ పరిధిని అందిస్తుంది. ఎక్స్ యూవీ 400 క్లెయిమ్ చేసిన 456 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

అదే సమయంలో ఎంజీ విండ్సర్ ఈవీ ప్రిస్మాటిక్ సెల్స్ తో కూడిన 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 331 కిమీ పరిధిని అందిస్తుంది. బ్యాటరీ నుంచి పవర్ ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ మోటార్ బదిలీ అవుతుంది. ఇది 136 హెచ్పీ శక్తిని, 200 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని 45 కేడబ్ల్యూ ఛార్జర్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. ఇది 55 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. 3.3 కేడబ్ల్యూ, 7.7 కేడబ్ల్యూ ఏసీ చార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది.ఇది వరుసగా 14 గంటలు, 6.6 గంటల్లో బ్యాటరీని 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయగలుగుతాయి.

ఎంజీ విండ్సర్ ఈవీ 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్‌తో పాటు 8.8-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలను అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో వస్తుంది. వెనుక ఏసీ వెంట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, యాంబియంట్ డైటింగ్ ను కూడా అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..