Amazon: కంటెంట్ క్రియేటర్లకు అమెజాన్ గుడ్ న్యూస్.. రెండింతలు ఎక్కువ సంపాదించుకునే అవకాశం..

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభ కానున్న తరుణంలో ప్లాట్ ఫాంలో కంటెంట్ ఇస్తున్న వారి కమిషన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. 20 కన్నా ఎక్కువ ఉన్న సబ్-కేటగరిల్లో కంటెంట్ సృష్టికర్తల కోసం ప్రామాణిక కమిషన్ ను పెంచుతున్నట్లు పేర్కొంది.

Amazon: కంటెంట్ క్రియేటర్లకు అమెజాన్ గుడ్ న్యూస్.. రెండింతలు ఎక్కువ సంపాదించుకునే అవకాశం..
Amazon
Follow us

|

Updated on: Sep 24, 2024 | 3:46 PM

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభ కానున్న తరుణంలో ప్లాట్ ఫాంలో కంటెంట్ ఇస్తున్న వారి కమిషన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. 20 కన్నా ఎక్కువ ఉన్న సబ్-కేటగరిల్లో కంటెంట్ సృష్టికర్తల కోసం ప్రామాణిక కమిషన్ ను పెంచుతున్నట్లు పేర్కొంది. సవరించిన కొత్త రేట్లు ఫ్యాషన్, అందం, వ్యక్తిగత సంరక్షణ ఉపకరణాలు, ఇల్లు, వంటగది, బొమ్మలు, పుస్తకాలు వంటి ప్రముఖ ఎంపికలతో సహా విస్తృత శ్రేణి ఉత్పత్తి వర్గాలలో కంటెంట్ సృష్టికర్తలకు 1.5 నుంచి రెండు రెట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అమెజాన్ వివరించింది. సెప్టెంబర్ 27న ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు ముందు ఈ ప్రకటన రావడంతో కంటెంట్ క్రియేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అధిక ఆదాయం సంపాదించుకునే అవకాశం..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) సమయంలో అధిక షాపింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ సంపాదించడానికి , అదే సమయంలో వినియోగదారుల డిమాండ్‌ను పెంచుకోవడానికి ఇది కంటెంట్ క్రియేటర్లకు అవకాశం కల్పిస్తోంది.

అమెజాన్ షాపింగ్ ఇనీషియేటివ్స్ అండ్ ఎమర్జెంగ్ మార్కెట్స్ డైరెక్టర్ జాహిద్ ఖాన్ మాట్లాడుతూ, ఈ మెరుగైన సపోర్ట్ సిస్టమ్ కంటెంట్ క్రియేటర్లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా కస్టమర్‌లకు మరింత ఆకర్షణీయమైన, రివార్డింగ్ షాపింగ్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. స్టాండర్డ్ కమీషన్ ఆదాయ రేట్లలో పెరుగుదలతో పాటు, ఆదాయంలో 10-15 శాతం వరకు టార్గెట్-లింక్డ్ ఇన్సెంటివ్‌లను కూడా ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

అమెజాన్ లైవ్ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఏజీఐఎఫ్ (అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్) కోసం వందలాది మంది క్రియేటర్‌లు మొబైల్‌లు, గృహోపకరణాలు, గృహాలంకరణ, ఫ్యాషన్, బ్యూటీతో సహా అనేక ఇతర విభాగాలలో 1,500 లైవ్ స్ట్రీమ్‌లను అమలు చేస్తారని అమెజాన్ పేర్కొంది. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్‌లకు 24 గంటల ముందస్తు యాక్సెస్ ఉంటుంది.

ఆన్ లైన్ షాపింగ్ పై ఆసక్తి..

అమెజాన్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవలి ఇప్సోస్ రీసెర్చ్ ఓ అధ్యయనం చేసింది. అదేమిటంటే.. ఈ ప్లాట్ ఫారంలో ఫెస్టివల్ సేల్స్ పట్ల వినియోగదారుల్లో బలమైన ఉత్సాహాన్ని వెల్లడిస్తుంది. 89% మంది పాల్గొనేవారు ఫెస్టివల్ సేల్స్ పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. 71% మంది ఈ సంవత్సరం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వినియోగదారుల విశ్వాసంలో ఈ పెరుగుదల స్పష్టంగా ఉంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనుకునే వారిలో దాదాపు సగం మంది గత సంవత్సరం కంటే ఎక్కువ ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. ఈ ధోరణి ముఖ్యంగా మెట్రో ప్రాంతాలు (55%), టైర్-2 నగరాల్లో (1 నుంచి 4 మిలియన్ల మధ్య జనాభా ఉన్నవారిలో 43%) ఉందని ఆ అధ్యయనంలో గుర్తించారు. కాగా ఎందుకు ఆన్ లైన్ షాపింగ్ పై నమ్మకం అనే ప్రశ్నకు 76శాతం మంది ఎప్పుడైనా, ఎక్కడైనా షాపింగ్ చేసే అవకాశం ఉండటం ప్రధాన కారణంగా పేర్కొన్నారు. అలాగే ఫాస్ట్ డెలివరీ (74%), ప్రామాణికమైన ఉత్పత్తుల కోసం ఆన్‌లైన్ ఈవెంట్‌లపై నమ్మకం (75%), నో-కాస్ట్ ఈఎంఐ (75%) వంటి ఆప్షన్ల ద్వారా ఈ ఫెస్టివల్స్ వైపు మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..