Bank Holidays: అక్టోబర్‌లో 14 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

చాలా మందికి ప్రతి రోజు బ్యాంకుల్లో ఏదో ఒక పని ఉంటుంది. లావాదేవీలు, డిపాజిట్లు తదితర పనులు చేసుకుంటుంటారు. అయితే ప్రతి నెల రాగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో గమనించడం చాలా ముఖ్యం. దీని ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ నెల ముగియబోతోంది. అక్టోబర్‌ నెల రానుంది. ఆర్బీఐ విడుదల..

Bank Holidays: అక్టోబర్‌లో 14 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holidays
Follow us

|

Updated on: Sep 24, 2024 | 3:58 PM

చాలా మందికి ప్రతి రోజు బ్యాంకుల్లో ఏదో ఒక పని ఉంటుంది. లావాదేవీలు, డిపాజిట్లు తదితర పనులు చేసుకుంటుంటారు. అయితే ప్రతి నెల రాగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో గమనించడం చాలా ముఖ్యం. దీని ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ నెల ముగియబోతోంది. అక్టోబర్‌ నెల రానుంది. ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులు భారీగానే ఉండనున్నాయి. ఏకంగా సగం రోజుల పాటు అంటే 14 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి.

అక్టోబర్ నెలలో చాలా పెద్ద పండుగలు వస్తాయి. గాంధీ జయంతి నుండి దసరా వరకు, ఈ నెలలో చాలా పెద్ద పండుగలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు కూడా సెలవులు రానున్నాయి. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ నెలలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం ఉత్తమం. అక్టోబరులో ఏ రోజు ఏయే ప్రదేశాలలో బ్యాంకులకు సెలవు ఉంటుందో తెలుసుకుందాం.

  1. అక్టోబర్ 2: గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  2. అక్టోబర్ 3: నవరాత్రి ప్రారంభం, మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా హర్యానా, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు
  3. ఇవి కూడా చదవండి
  4. అక్టోబర్ 6: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెవులు
  5. అక్టోబర్ 10: మహా సప్తమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  6. అక్టోబర్ 11: మహానవమి సందర్భంగా ఏపీ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
  7. అక్టోబర్ 12: ఆయుధ పూజ, దసరా, రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  8. అక్టోబర్ 13: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
  9. అక్టోబర్‌ 14: దుర్గాపూజ (దస్సేన్‌), గాంగ్టక్‌ (సిక్కిం)
  10. అక్టోబర్‌ 16: లక్ష్మీ పూజ, అగర్తల, కోల్‌కతా
  11. అక్టోబర్ 17: వాల్మికి జయంతి సందర్భంగా అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు  బంద్మూ
  12. అక్టోబర్ 20: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
  13. అక్టోబర్ 26: నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు బంద్‌ (విలీన దినం- జమ్మూఅండ్‌ కశ్మీర్‌)
  14. అక్టోబర్ 27: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
  15. అక్టోబర్ 31: దీపావళి కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

(నోట్‌: ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..