AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Cars: ప్రపంచంలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు ఉన్న మొదటి దేశం ఏదో తెలుసా?

పెట్రోలు, డీజిల్ వంటి ఇంధన ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం..

Electric Cars: ప్రపంచంలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు ఉన్న మొదటి దేశం ఏదో తెలుసా?
Subhash Goud
|

Updated on: Sep 24, 2024 | 3:05 PM

Share

పెట్రోలు, డీజిల్ వంటి ఇంధన ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం రాయితీలు, మొదలైనవి ఇస్తోంది. కానీ ప్రస్తుతం భారత్ వంటి దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పరిమితంగానే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశంలో ఏదో తెలుసా? ఇందులో ప్రపంచంలోనే మొదటి దేశంగా నార్వే నిలిచింది.

నార్వేజియన్ రోడ్ ఫెడరేషన్ విడుదల చేసిన వాహన రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం.. నార్వేలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. నార్డిక్ దేశంలో నమోదైన 2.8 మిలియన్ల ప్రైవేట్ ప్యాసింజర్ కార్లలో 7,54,303 యూనిట్లు పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లు అని నార్వేజియన్ రోడ్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. 7,53,905 యూనిట్ల పెట్రోల్ వాహనాలు ఉన్నాయి. అంతే కాకుండా డీజిల్‌తో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్‌ చాలా తక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి: Bank Account: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా? వెంటనే ఈ పని చేయండి.. లేకుంటే అకౌంట్‌ క్లోజ్‌!

ఇవి కూడా చదవండి

ఫెడరేషన్ డైరెక్టర్ Oyvind Solberg Thorsen మాట్లాడుతూ..ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. 10 సంవత్సరాల క్రితం చాలా కొద్ది మంది మాత్రమే ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య పెట్రోల్-డీజిల్ వాహనాల కంటే ఎక్కువగా ఉంటుందని భావించారు. ప్రధాన చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం నార్వే. 2025 నాటికి జీరో-ఎమిషన్ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆగస్టులో నార్వేలో నమోదైన కొత్త వాహనాల్లో రికార్డు స్థాయిలో 94.3 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే అని చెప్పారు.

ఈ అద్భుతం ఎలా జరిగింది:

చాలా ఏళ్ల క్రితమే నార్వే ఈ విజయానికి పునాది వేసింది. 1990ల ప్రారంభం నుండి ప్రభుత్వం, స్థానిక ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు అని అర్థం చేసుకున్నారు. అటువంటి పరిస్థితిలో నార్వేజియన్ పార్లమెంట్ 2025 నాటికి విక్రయించే అన్ని కొత్త కార్లు జీరో-ఎమిషన్ (ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజన్)గా ఉండాలని జాతీయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 2022 చివరి నాటికి నార్వేలో నమోదైన కార్లలో 20 శాతానికి పైగా బ్యాటరీ ఎలక్ట్రిక్ (BEV) ఉన్నాయి. 2022లో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వాటా 79.2 శాతం.

ఇది కూడా చదవండి: Whiskey: మన దేశంలో ఈ విస్కీకి భారీ డిమాండ్‌.. దిగుమతిలో అమెరికా, చైనాలను వెనక్కి నెట్టేసిన భారత్‌!

ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రణాళికలు కొనసాగుతున్నాయి. అయితే 55 లక్షల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు చూపుతున్న అవగాహన అందరికంటే భిన్నమైనది. ఈవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రారంభించింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును సరసమైనది. అలాగే సులభతరం చేయడమే కాకుండా దాని రోజువారీ నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గించింది. ఇందుకు అన్ని రకాల మినహాయింపులు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: BSNL 4G: గుడ్‌న్యూస్‌.. ఇక పూర్తిగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ ఎప్పుడొస్తుందో చెప్పిన మంత్రి

పన్ను విధానం:

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే అతిపెద్ద పని దానిపై విధించిన పన్నుకు సంబంధించినది. నార్వేజియన్ ప్రభుత్వం అధిక ఉద్గార కార్లపై అధిక పన్నులు విధించాలని, తక్కువ, సున్నా ఉద్గార కార్లపై తక్కువ పన్నులు విధించాలని నిర్ణయించింది. దీని తర్వాత NOK (నార్వేజియన్ క్రోన్) 5,00,000 (సుమారు రూ. 40 లక్షలు) వరకు ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలకు వ్యాట్ నుండి మినహాయింపు ఉంది. అదనంగా NOK 500,000 కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు, అదనపు మొత్తంపై మాత్రమే 25% VAT నియమం వర్తిస్తుంది.

దిగుమతి పన్ను నుండి మినహాయింపు:

ఇది మాత్రమే కాదు, 1990 నుండి 2022 వరకు నార్వేలో ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలు, దిగుమతి పన్ను విధించలేదు. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కూడా స్థానికులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది కాకుండా, స్థానిక ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు వాహనాల తయారీకి సంవత్సరాలపాటు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఇతర మినహాయింపుల నుండి కూడా ఉపశమనం:

VAT, దిగుమతి పన్నులతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు 1997 నుండి 2017 వరకు నార్వేలో టోల్ రోడ్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చింది. ఇది కాకుండా, ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షించడానికి కొన్ని ప్రత్యేక తగ్గింపులను సంవత్సరాలుగా అందించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఉచిత మునిసిపల్ పార్కింగ్, బస్ లేన్‌లలో EVలను యాక్సెస్ చేయడం మొదలైన వాటి ద్వారా ప్రజలను ఈవీల వైపు ప్రోత్సహించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి