AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposits: ఆ బ్యాంకుకు షాక్‌ ఇచ్చిన ఆర్‌బీఐ.. రూ.189 ఇవ్వనందుకు ఇరవై వేల ఫైన్‌

భారతదేశంలో చాలా ఏళ్లుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అనేది నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉన్నాయి. ముఖ్యంగా రిటైరైన వ్యక్తులు తమకు ఒకేసారి చేతికి వచ్చే రిటైర్‌మెంట్‌ సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేస్తూ ఉంటారు. బ్యాంకులు కూడా ఇలాంటి వారికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షి‍స్తాయి. అయితే వడ్డీ చెల్లింపు విషయంలో అధికారులు చూపించిన అత్యుత్సాహం వల్ల ఆర్‌బీఐ ఓ బ్యాంకుకు ఇరవై వేల ఫైన్‌ విధించింది.

Fixed Deposits: ఆ బ్యాంకుకు షాక్‌ ఇచ్చిన ఆర్‌బీఐ.. రూ.189 ఇవ్వనందుకు ఇరవై వేల ఫైన్‌
Rbi
Nikhil
|

Updated on: Oct 03, 2024 | 8:45 PM

Share

భారతదేశంలో చాలా ఏళ్లుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అనేది నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉన్నాయి. ముఖ్యంగా రిటైరైన వ్యక్తులు తమకు ఒకేసారి చేతికి వచ్చే రిటైర్‌మెంట్‌ సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేస్తూ ఉంటారు. బ్యాంకులు కూడా ఇలాంటి వారికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షి‍స్తాయి. అయితే వడ్డీ చెల్లింపు విషయంలో అధికారులు చూపించిన అత్యుత్సాహం వల్ల ఆర్‌బీఐ ఓ బ్యాంకుకు ఇరవై వేల ఫైన్‌ విధించింది.ముంబైలోని బంధన్‌ బ్యాంక్‌ వాషి శాఖలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బంధన బ్యాంకునకు విధించిన ఫైన్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ముంబైలోని కోపర్ ఖైరానే నివాసి రామ గుప్తా (64), ఆమె భర్త దీపక్ గుప్తా అనే దంపతులకు వాషిలో ఉన్న బంధన్ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నాయి. వారు ఈ ఏడాది జనవరి 15న బంధన్ బ్యాంక్ వాషి బ్రాంచ్‌లో ఎఫ్‌డీ ఖాతాను తెరిచారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ఎఫ్‌డీ రసీదును జనవరి 16న రశీదును అందించారు. రసీదు జనరేట్‌ అయ్యిన తేదీ నుంచే వడ్డీ చెల్లించడంతో తమకు రూ.186 నష్టం వచ్చింది. ఈ మేరకు జరిగిన అన్యాయంపై వారి కుమారుడు అనుజ్ కుమార్ గుప్తా సాయంతో ఆర్‌బీఐకు ఫిర్యాదు చేశారు. తప్పును సరిదిద్దమని చాలా బ్యాంకుకు నివేదించినా సరైన స్పందన రాకపోవడంతో ఆర్‌బీఐను ఆశ్రయించామని అనుజ్‌ కుమార్‌ గుప్తా చెబుతున్నారు. 

చాలా రోజుల నుంచి అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో జనవరి 24న అధికారికంగా ఫిర్యాదు చేశారు. అయితే అంతర్గత నిబంధనల ప్రకారం రోజు వారీ లావాదేవీలు ముగియడానికి తమకు రాత్రి 11.10 గంటల సమయం ఉందని, రాత్రి 11.12 గంటలకు ఎఫ్‌డీ ప్రక్రియ ప్రారంభించినందున, ఈ జంట వడ్డీకి అర్హులు కాదని బ్యాంక్ పేర్కొంది. దీంతో బాధితులు ఆర్‌బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కార్యాలయాన్ని సంప్రదించడంతో ఆర్‌బీఐ బ్యాంకుకు రూ.20 వేల జరిమానా విధిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..