BMW CE 02: ఈ లుక్ కోసం లక్షలు పోసినా తప్పులేదంతే.. ఆకర్షిస్తున్న బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు ప్రజలు ఇష్టపడుతుండడంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు మార్కెట్‌లో తమ మోడల్ ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రీమియం వాహనాల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీను అందుబాటులోకి తీసుకుని వస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో రూ. 4.5 లక్షలకు ధరతో విడుదల చేస్తుందని పేర్కొంటున్నారు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు ప్రజలు ఇష్టపడుతుండడంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు మార్కెట్‌లో తమ మోడల్ ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రీమియం వాహనాల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీను అందుబాటులోకి తీసుకుని వస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో రూ. 4.5 లక్షలకు ధరతో విడుదల చేస్తుందని పేర్కొంటున్నారు. బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్ భారతదేశంలో బీఎండబ్ల్యూకు సంబంధించిన రెండో స్కూటర్‌గా ఉండనుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత రైడర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ స్కూటర్ లుక్ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ సీఈ-02 స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బీఎండబ్ల్యూ సీఈ 02 ఎయిర్-కూల్డ్ సింక్రోనస్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ 3.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ 108 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. నగరంలో పనితీరు విషయానికొస్తే ఈ స్కూటర్ 3 సెకన్లలో 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని బీఎండబ్ల్యూ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం 95 కిలోమీటర్లుగా ఉంది. అలాగే ఈ స్కూటర్ ప్రామాణిక 0.9 కేడబ్ల్యూ ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి 5 గంటల 12 నిమిషాలు పడుతుంది. అయితే 1.5 కేడబ్ల్యూ యూనిట్ 3 గంటల 30 నిమిషాల్లో చార్జ్ అవుతుంది. అయితే ఈవీ స్కూటర్ మినిమలిస్టిక్ లుక్ అందరినీ విపరీతంగా ఆకర్షిస్తుంది.
బీఎండబ్ల్యూ సీఈ 02 ఈవీ స్కూటర్ చూట్టూ ఎలాంటి బాడీ ప్యానెల్‌లు లేవు. అలాగే స్కూటర్ మోటారు, బ్యాటరీ ప్యాక్ చుట్టూ నిర్మించినట్లు కనిపిస్తోంది. బీఎండబ్ల్యూ సీఈ 02 రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది. కాస్మిక్ బ్లాక్, కాస్మిక్ బ్లాక్ 2 రంగుల్లో కొనుగోలు సిద్ధంగా ఉంది. సీఈ 02 స్కూటర్‌లో డబుల్-లూప్ స్టీల్ ఫ్రేమ్‌ను ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ ఇల్యూమినేషన్, యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, రెండు రైడ్ మోడ్‌లు – ఫ్లో, సర్ఫ్, సింగిల్-ఛానల్ ఏబీఎస్, స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ మోడ్, కీలెస్ ఆపరేషన్, యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, రికపరేషన్ స్టెబిలిటీ కంట్రోల్‌తో వచ్చే ఈ స్కూటర్ మోటోరాడ్ డీలర్‌షిప్స్ వద్ద బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే మరికొద్ది రోజుల్లో ఈ స్కూటర్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..