AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk vs Adani: ప్రపంచంలో మొదటి ట్రిలియనీర్ ఎవరు అవుతారు? ఎంత సంపద ఉండాలి?

ఎన్నో పరిశ్రమలకు యజమాని అయిన ఎలోన్ మస్క్ ఇప్పుడున్నట్టుగా సంపదను కూడగడుతూనే ఉంటే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు. ఇన్ఫార్మా కనెక్ట్ అకాడెమీ ట్రిలియనీర్‌ గురించి వెల్లడించింది. ఎలోన్ మస్క్ 2027 నాటికి ట్రిలియనీర్ కావచ్చని తెలిపింది. భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ..

Elon Musk vs Adani: ప్రపంచంలో మొదటి ట్రిలియనీర్ ఎవరు అవుతారు? ఎంత సంపద ఉండాలి?
Elon Musk Vs Adani
Subhash Goud
|

Updated on: Sep 11, 2024 | 10:06 AM

Share

ఎన్నో పరిశ్రమలకు యజమాని అయిన ఎలోన్ మస్క్ ఇప్పుడున్నట్టుగా సంపదను కూడగడుతూనే ఉంటే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు. ఇన్ఫార్మా కనెక్ట్ అకాడెమీ ట్రిలియనీర్‌ గురించి వెల్లడించింది. ఎలోన్ మస్క్ 2027 నాటికి ట్రిలియనీర్ కావచ్చని తెలిపింది. భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ ట్రిలియనీర్ కావచ్చు. 2028 నాటికి అతను ఆ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. అది కూడా వారి సంపద ప్రస్తుత రేటులోనే కొనసాగితే ఇది జరగవచ్చు. జెన్సన్ హువాంగ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, సెర్గీ బ్రిన్, జెఫ్ బెజోస్ మొదలైనవారు కూడా ట్రిలియనీర్లుగా అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.

ఒక ట్రిలియనీర్ ఎంత ఆస్తిని కలిగి ఉండాలి?

బిలియనీర్‌గా పరిగణించాలాంటే కనీసం ఒక బిలియన్ డాలర్లు (100 కోట్లు), అంటే 8,500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కలిగి ఉండాలి. ట్రిలియనీర్ అంటే లక్ష కోట్ల డాలర్ల సంపన్నుడు. అంటే దాదాపు 85 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఉన్నవారిని ట్రిలియనీర్లు అంటారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ఎలోన్ మస్క్ విలువ 251 బిలియన్ డాలర్లు. అతని వార్షిక సగటు రేటు 110 శాతం పెరుగుతోంది. సంపద అదే వేగంతో పెరిగితే 2027 నాటికి ఆయన సంపద 1,000 బిలియన్ డాలర్లు లేదా ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. అతను తన సంపదను వేగంగా పెంచుకుంటూ ఉంటే, అతను ఒకటి లేదా రెండు సంవత్సరాలలో ట్రిలియనీర్ అయినా ఆశ్చర్యం లేదు.

ఇవి కూడా చదవండి

గౌతమ్ అదానీ షేర్ సంపద ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లు కూడా లేదు. సంపదలో 13వ స్థానంలో ఉన్నారు. ఇంకా అతని సంపద 123 శాతం చొప్పున పెరుగుతోంది. ఇది ఇలాగే పెరిగితే 2028 నాటికి ట్రిలియనీర్ అవుతారు. ఎలోన్ మస్క్ తర్వాత అదానీ ఉండవచ్చు.

భారతదేశం నంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ సగటు వార్షిక రేటు 28.25% వృద్ధి చెందుతున్నారు. అతను ట్రిలియనీర్ల సమూహంలో 2033 వరకు కావచ్చు. 1916లో అమెరికన్ ధనవంతుడు జాన్ డి.రాక్‌ఫెల్లర్ ప్రపంచంలోనే మొదటి బిలియనీర్ అయ్యాడు. ఆ తర్వాత చాలా మంది కోటీశ్వరులు వచ్చి వెళ్లిపోయారు. ట్రిలియనీర్ మాటేలేకుండా పోయింది. ఎలాన్ మస్క్ ఆ మైలురాయిని చేరుకుంటాడో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి