PM Kisan: ఇక వీరికి పీఎం కిసాన్‌ డబ్బులు రావు.. కారణం ఏంటో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ కింద రైతులు ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటి వరకు రైతులు 17వ విడత డబ్బులు అందుకోగా..

PM Kisan: ఇక వీరికి పీఎం కిసాన్‌ డబ్బులు రావు.. కారణం ఏంటో తెలుసా?
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: Sep 11, 2024 | 8:20 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ కింద రైతులు ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటి వరకు రైతులు 17వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 18వ విడత రానుంది. ఈ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ జాబితాలో పేరున్నప్పటికీ, పథకానికి సంబంధించిన అవసరమైన షరతులను నెరవేర్చనందున చాలా మంది రైతులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. ఈ పథకానికి సంబంధించిన అన్ని షరతులు నెరవేర్చిన రైతుల ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం వాయిదాల సొమ్మును జమ చేస్తోంది. మీరు కూడా పథకం లబ్ధిదారు అయితే, దాని ముఖ్యమైన షరతుల గురించి తెలుసుకోండి. అయితే 18వి విడత అక్టోబర్‌లో విడదలయ్యే అవకాశం ఉంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు, కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. దీనితో పాటు, భూమి ధృవీకరణను కూడా పూర్తి చేయడం తప్పనిసరి. ఈ షరతులను నెరవేర్చని లబ్ధిదారులు పథకం తదుపరి విడత ప్రయోజనం పొందలేరు. అటువంటి పరిస్థితిలో మీరు ఇంకా ఈ పనులను పూర్తి చేయకపోతే వెంటనే చేసుకోవడం బెటర్‌. ఒక వేళ మీరు కేవైసీ పూర్తి చేయకపోతే ఈ విడత నుంచి డబ్బులు అందవు.

➦ దీని కోసం ముందుగా మీరు పీఎం కిసాన్ పథకం pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఇవి కూడా చదవండి

➦ తర్వాత, హోమ్ పేజీకి వెళ్లి, ఫార్మర్ కార్నర్ విభాగంలో e-KYC ఆప్షన్‌ను ఎంచుకోండి.

➦ తర్వాత e-KYC పేజీకి వెళ్లి మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

➦ దీని తర్వాత సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

➦ దీని తర్వాత మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

➦ అక్కడ నెంబర్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ కి OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయండి.

➦ OTPని నమోదు చేశాక సబ్మిట్‌పై క్లిక్‌ చేయండి.

➦ ఈ ప్రక్రియ తర్వాత మీ e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.

➦ తర్వాత ఈ కేవైసీ పూర్తయినట్లు మీ మొబైల్‌కు సందేశం వస్తుంది.

E-KYC ఆఫ్‌లైన్‌లో కూడా చేయవచ్చు:

ఆన్‌లైన్‌తో పాటు, రైతులకు ఇ-కెవైసిని ఆఫ్‌లైన్‌లో పొందే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. మీరు మీ సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా e-KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీని కోసం మీరు కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. e-KYC ప్రక్రియను పూర్తి చేస్తున్నప్పుడు, మీ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలని గుర్తించుకోండి. లేదంటే ఈ ప్రక్రియ పూర్తికాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి