AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు గంగమ్మ ఒడిని చేరనున్న అత్యంత సంపద వినాయకుడు.. ఈ గణపతి మండపం భీమా కంపెనీలకు అత్యంత ఇష్టం..

గణపతి ఉత్సవాల సందర్భంగా గౌడ్ సారస్వత బ్రాహ్మణ సేవా మండలానికి చెందిన గణపతికి 400.58 కోట్ల రూపాయల భీమా ఏర్పాటు చేశారు. ఇక్కడ గణపతి ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 11వ తేదీ) ఐదో రోజు. దీంతో ఇక్కడ గణపతిని నేడు నిమజ్జనం చేయనున్నారు. ఈ రోజు భక్తుల సమక్షంలో గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు బొజ్జ గణపయ్య

నేడు గంగమ్మ ఒడిని చేరనున్న అత్యంత సంపద వినాయకుడు.. ఈ గణపతి మండపం భీమా కంపెనీలకు అత్యంత ఇష్టం..
Mumbai's Richest Bappa
Surya Kala
|

Updated on: Sep 11, 2024 | 8:36 AM

Share

భారతదేశంలో పండుగల అందం వేరు. ఒకొక్క పండగకు ఒకొక్క విశిష్టత ఉంది. ప్రస్తుతం దేశంలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే దేశంలో బీమా కంపెనీలకు అత్యంత ఇష్టమైన గణపతి మండపం గురించి తెలిసిందే.. ఈ వినాయక మండపాన్ని భీమా సంస్థలు ఎక్కువగా ఇష్టపడడానికి కూడా కారణం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఈ గణపతి వారికి పెద్ద బిజినెస్ అవకాశాన్ని ఇస్తుంది. ఈ పండల్‌లోని గణపతి విగ్రహానికి ఈ ఏడాది రూ.400 కోట్లకు పైగా బీమా చేశారు.

ఇక్కడ మనం ముంబైలోని గౌరు సరస్వతి బ్రాహ్మణ సేవా మండల్ కి చెందిన గణపతి మండపం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ముంబైలోని కింగ్ సర్కిల్ వద్ద మండపంలో గణపతి విగ్రహాన్ని ప్రతిస్తారు. ముంబైలోని అత్యంత ధనిక గణపతి మండలం ఇదే. గణపతి ఉత్సవాల సందర్భంగా గౌడ్ సారస్వత బ్రాహ్మణ సేవా మండలానికి చెందిన గణపతికి 400.58 కోట్ల రూపాయల భీమా ఏర్పాటు చేశారు. ఇక్కడ గణపతి ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 11వ తేదీ) ఐదో రోజు. దీంతో ఇక్కడ గణపతిని నేడు నిమజ్జనం చేయనున్నారు. ఈ రోజు భక్తుల సమక్షంలో గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు బొజ్జ గణపయ్య.

గంటల లెక్కన బిజినెస్ చేసిన భీమా సంస్థలు

ఒక ET నివేదిక ప్రకారం.. దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో దాదాపు 2,000 గణపతి ఉత్సవ కమిటీలు ఉన్నాయి. వీటిలో చాలా మండపాలు గణపతి ఉత్సవాల సందర్భంగా బీమా కంపెనీలకు మంచి బిజినెస్ జరుగుతుంది. గణేశుడి విగ్రహంపై అలంకరించే బంగారు ఆభరణాలు, దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత, అగ్నిప్రమాదం లేదా మరేదైనా ప్రమాదం మొదలైన వాటికి సంబంధించిన నష్టాలను బీమా తరచుగా కవర్ చేస్తుంది. అయితే ఈ గౌరు సరస్వతి బ్రాహ్మణ సేవా మండల్ కి చెందిన వారు గణపతి ఉత్సవ్ సందర్భంగా బ్యాంక్ లాకర్ నుండి తెచ్చిన బంగారు ఆభరణాలు తిరిగి బ్యాంక్ లాకర్‌కు చేరుకునే వరకు బీమా చేయబడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బీమా ప్రీమియం లెక్కింపు

ఈ బీమా పాలసీల ప్రీమియం లెక్కింపులోకి వెళ్తే రూ. 1 కోటి ఇన్సురెన్స్ కు రూ. 20,000లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేకంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ బీమా కవరేజ్ గా రూ.75 లక్షల ప్రీమియం వసూలు చేసింది.

ముంబైలోని అత్యంత సంపన్నమైన పండల్  

ప్రస్తుతం గణపయ్య 66 కిలోల బంగారం, దాదాపు 330 కిలోల వెండి ఆభరణాలు ధరించాడు. కిరీటం అత్యంత ఖరీదైనది. ఇది వజ్రాలు , ఇతర విలువైన రాళ్లతో తయారు చేశారు. చాలా ఆభరణాలు కర్ణాటకలోని మంగళూరుకు చెందిన దక్షిణ భారత ఆభరణాల వ్యాపారిచే రూపొందించబడ్డాయి. భక్తులు తమ మనసులోని కోరిక నెరవేరిన తర్వాత గణపయ్యకు కృతజ్ఞతగా విరాళంగా ఇవ్వడంతో ప్రతి సంవత్సరం వినాయకుడికి ఆభరణాల జాబితాలో మరికొన్ని నగలు చేరతాయి.  

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..