Vinayaka Chavithi: తొండం లేని గణపతి కొలువైన ఆలయం.. ఉత్తరాలు రాసి సమస్యలు తెలియజేసే భక్తులు.. ఎక్కడంటే
ఈ ఆలయం అనేక కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో రెండు ఎలుక రాతి విగ్రహాల ప్రతిష్టించబడ్డాయి. భక్తులు ఈ రెండు ఎలుకల వద్దకు వెళ్లి తమ జీవిత బాధను చెవుల్లో చెప్పుకుంటారు. ఆ ఎలుకలు భక్తుల కష్టాలను గణేశుడికి తెలియజేస్తాయి. ఆ తర్వాత వినాయకుడు భక్తుల కష్టాలను తొలగిస్తాడు. అంతే కాకుండా ఈ ఆలయానికి చేరుకునే మధ్యలో శివాలయం కూడా ఉంది. ప్రజలు ముందుగా ఈ ఆలయం వద్ద ఆగి శివపార్వతిని పూజించి, ఆపై ప్రధాన ఆలయ సముదాయంలోకి ప్రవేశిస్తారు
హిందూ సంస్కృతిలో ఒకటి కంటే ఎక్కువ దేవుళ్లు ఉన్నారు. దేవీ దేవతలను పూజిస్తారు. కష్టాలు తీర్చి జీవితంలో సుఖ సంతోషాలు ఇవ్వమని.. మంచి దేవుడిని ప్రార్థిస్తారు. ప్రస్తుతం వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో బప్పా విగ్రహాన్ని తమ ఇంటిలో ప్రతిష్టించి వాటిని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. భారతదేశంలో ఈ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం విభిన్నమైన వేడుకలను నిర్వహిస్తారు. హిందూ మతంలో గణేశుడికి అత్యున్నత స్థానం ఉంది. ఏదైనా పని ప్రారంభించే ముందు బప్పాను పూజించి ప్రార్ధిస్తారు. దేశవ్యాప్తంగా అనేక వినాయక ఆలయాలు ఉన్నాయి. అయితే అరుదైన ఆలయాలు కొన్ని ఉన్నాయి. వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం ఈ ఆలయాలను సందర్శిస్తారు. అలాంటి వాటిలో ఒక గణేశుని ఆలయం వెరీ వెరీ స్పెషల్.
ఈ దేవాలయం అనేక కారణాల వల్ల ప్రత్యేకమైనది. ఈ ఆలయంలోని వినాయకుడి విగ్రహం కూడా చాలా విశిష్టమైనది. అంతే కాకుండా ఈ ఆలయంలో వినాయకుడిని పూజించే విధానం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. భక్తులు వివిధ పద్ధతులను అవలంబిస్తూ తమ సమస్యలను భగవంతుడికి తెలియజేస్తారు. గణేశుడి కూడా తనకు తెలియజేసిన సమస్యలను పరిష్కరిస్తున్నాడు. ఈ ప్రత్యేక ఆలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ఎవరైనా ఈ ఆలయానికి సమీపంలోకి వెళ్తే.. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.
అది ఏ దేవాలయం
ఈ ఆలయాన్ని గర్ గణేష్ టెంపుల్ అని పిలుస్తారు. ఇది గణేశుని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉంది. ఇది నహర్‌ఘర్, జైఘర్ కోట సమీపంలో ఉంది. ఈ ఆలయం సుమారు 300 సంవత్సరాల నాటిదని చెబుతారు. దీనిని సవాయి జై సింగ్ నిర్మించాడని.. ప్రముఖ పండితులను కూడా పిలిచి ఇక్కడ అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడని చెబుతారు. దీని ఆరోహణ దాదాపు 500 మీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం 365 మెట్లు ఎక్కిన తరువాత భక్తులు ఈ ఆలయంలో గణపతిని దర్శనం చేసుకోగలుగుతారు. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని మెట్లు ఎక్కితే గర్హ్‌లో గణేశుడి దర్శనం పొందవచ్చని చెబుతారు. ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు పూజల కోసం వస్తుంటారు.
ఈ ఆలయం ఎందుకు అరుదు?
ఈ ఆలయం అనేక కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో రెండు ఎలుక రాతి విగ్రహాల ప్రతిష్టించబడ్డాయి. భక్తులు ఈ రెండు ఎలుకల వద్దకు వెళ్లి తమ జీవిత బాధను చెవుల్లో చెప్పుకుంటారు. ఆ ఎలుకలు భక్తుల కష్టాలను గణేశుడికి తెలియజేస్తాయి. ఆ తర్వాత వినాయకుడు భక్తుల కష్టాలను తొలగిస్తాడు. అంతే కాకుండా ఈ ఆలయానికి చేరుకునే మధ్యలో శివాలయం కూడా ఉంది. ప్రజలు ముందుగా ఈ ఆలయం వద్ద ఆగి శివపార్వతిని పూజించి, ఆపై ప్రధాన ఆలయ సముదాయంలోకి ప్రవేశిస్తారు. అంతేకాదు ఈ ఆలయంలో బప్పాను పూజించే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుందని ఒక నమ్మకం.
గణేశుడి విగ్రహం శిశివు రూపంలో ఉంది. దీని ప్రత్యేక ప్రతీకలతో భక్తులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విగ్రహం అనేక గణేశ విగ్రహాలలో కనిపించే సాంప్రదాయ తొండం లేదు. ఇది ఆలయ ఆధ్యాత్మిక వాతావరణానికి ఆకర్షణీయమైన అంశాన్ని జోడిస్తుంది
భక్తులు దేవుడికి ఉత్తరాలు రాస్తారు
ఈ ఆలయంలో గణేశుడిని పూజించే సమయంలో భక్తులు ఆయనకు లేఖలు రాస్తూ తమ బాధలను ఆయనకు తెలియజేస్తారు. ఇలా చేయడం ద్వారా వారి సందేశం భగవంతుని చేరుతుందని.. తద్వారా భగవంతుడు తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని భక్తులు నమ్ముతారు. 7 బుధవారాలు నిరంతరం భగవంతుడిని దర్శించుకుంటే కోరుకున్న ఫలితాలను పొందుతారని.. గణేశుడు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి