AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: ఐదవ రోజు గణపతిని నిమజ్జనం చేయాలనుకుంటున్నారా! శుభ సమయం, విధి విధానం ఏమిటంటే

గణేశుడిని నిమజ్జనం చేయడానికి ముందుగా చెక్క ఆసనాన్ని సిద్ధం చేయండి. దానిని గంగాజలంతో శుద్ధి చేసి స్వస్తిక్ గుర్తు వేయాలి. అనంతరం పీటంపై పసుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచి కొత్త బట్టలు ధరింప జేసి, కుంకుమ తిలకం దిద్దండి. అనంతరం ఆసనంపై అక్షతను ఉంచి గణేశ విగ్రహానికి పూలు, పండ్లు, మోదకం మొదలైన వాటిని సమర్పించండి.

Vinayaka Chavithi: ఐదవ రోజు గణపతిని నిమజ్జనం చేయాలనుకుంటున్నారా! శుభ సమయం, విధి విధానం ఏమిటంటే
Ganesh Immersion 5th Day
Surya Kala
|

Updated on: Sep 10, 2024 | 6:47 AM

Share

వినాయక చవితి ఉత్సవాలు భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిది నుంచి మొదలయ్యాయి. ఈ ఉత్సవాలను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సమయంలో గణపతి భక్తులు గజాననుడి విగ్రహాన్ని తమ ఇంటికి తీసుకువచ్చి పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఆ తర్వాత అనంత చతుర్దశి రోజున వినాయకుడి విగ్రహాన్ని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి వీడ్కోలు పలుకుతారు. ఈసారి సెప్టెంబరు 17న అనంత చతుర్దశి. అయితే కొంతమంది మాత్రం తమ ఇంట్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను కొన్ని రోజుల ముందే నిమజ్జనం చేస్తారు. కొంతమంది బప్పా విగ్రహాన్ని 3 రోజులలోపు .. మరికొందరు 5 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. ఈ నేపధ్యంలో ఐదవ రోజు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలనుకుంటే శుభ ముహర్తం, విధి విధానాలను గురించి తెలుసుకుందాం..

గణపతి నిమజ్జనం శుభ ముహూర్తం

హిందూ వైదిక క్యాలెండర్ ప్రకారం గణపతి ఉత్సవం 5 వ రోజు సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం. ఈ నేపధ్యంలో 5 వ రోజున గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకునే వారికి ఉదయం 10.45 నుండి 12.18 వరకు శుభ సమయం.

నిమజ్జనం విధి విధానం

గణేశుడిని నిమజ్జనం చేయడానికి ముందుగా చెక్క ఆసనాన్ని సిద్ధం చేయండి. దానిని గంగాజలంతో శుద్ధి చేసి స్వస్తిక్ గుర్తు వేయాలి. అనంతరం పీటంపై పసుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచి కొత్త బట్టలు ధరింప జేసి, కుంకుమ తిలకం దిద్దండి. అనంతరం ఆసనంపై అక్షతను ఉంచి గణేశ విగ్రహానికి పూలు, పండ్లు, మోదకం మొదలైన వాటిని సమర్పించండి. బప్పా విగ్రహాన్ని నిమజ్జనం చేసే ముందు పూర్తి ఆచారాలతో పూజించండి. గణేశుని మళ్ళీ ఇంటికి తిరిగి రావాలని కూడా ప్రార్థించండి. ఆ తర్వాత కుటుంబంతో కలిసి హారతి ఇవ్వండి. ఆ తరువాత గణేశ విగ్రహాన్ని ఆచారబద్ధంగా నిమజ్జనం చేయండి. ఏమైనా తెలిసి తెలియక చేసిన తప్పులుంటే క్షమించమని అడగండి.. వచ్చే ఏడాది మళ్లీ రావాలని ప్రార్థించండి.

ఇవి కూడా చదవండి

నిమజ్జనం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. నిమజ్జనానికి వెళుతున్నట్లయితే, పొరపాటున కూడా నలుపు లేదా నీలం రంగు దుస్తులను ధరించవద్దు. నిమజ్జనానికి ముందు గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించవద్దు. గణేశుడి అనుగ్రహం కోసం 21 దర్భ కట్టలు సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి