AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. మళ్లీ అమల్లోకి వచ్చిన విభూతిధారణ..

నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయమని ఎంతో విశిష్టమైన మన సంస్కృతికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ఈఓ పెద్దిరాజు అన్నారు. అందుకే ఆలయప్రవేశం చేసేవారందరూ తప్పనిసరిగా నుదుట బొట్టును ధరించేందుకు వీలుగా ఈ విభూతిధారణ తిరిగి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. మళ్లీ అమల్లోకి వచ్చిన విభూతిధారణ..
Vibhuti Dharana
Jyothi Gadda
|

Updated on: Sep 09, 2024 | 9:17 PM

Share

శ్రీశైల మల్లన్న భక్తులకు శుభవార్త..శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిలిపివేసిన విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. శ్రీశైలం మల్లన్న ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు విభూతిధారణ చేయించే సంప్రదాయాన్ని ఆలయ ఈఓ పెద్దిరాజు స్వయంగా పునః ప్రారంభించారు. ఆలయానికి వెళ్లే దర్శనం క్యూకాంప్లెక్సు దగ్గర ఈ విభూతి తిలక ధారణను భక్తులకు అందుబాటులో ఉంచారు. స్వామివారి దర్శనానికి వెళ్లు ప్రతి భక్తుడు విభూతి తిలకదారణ చేసుకుని శివనామ స్మరణతో ఆలయంలోనికి ప్రవేశించాలని భక్తులకు స్వయంగా ఈఓ పెద్దిరాజు విభూతిధారణపై అవగాహన కల్పించారు.

అయితే గతంలో అమలులో ఉన్న స్వామివారి విభూతిధారణ కార్యక్రమం కోవిడ్ సమయంలో దేవస్థానం అధికారులు నిలుపుచేశారు. అయితే, ఆలయ సంస్కృతీ సంప్రదాయాలపై భక్తులందరికీ మరింత అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఈ విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించామని ఈవో తెలిపారు. నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయమని ఎంతో విశిష్టమైన మన సంస్కృతికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ఈఓ పెద్దిరాజు అన్నారు. అందుకే ఆలయప్రవేశం చేసేవారందరూ తప్పనిసరిగా నుదుట బొట్టును ధరించేందుకు వీలుగా ఈ విభూతిధారణ తిరిగి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ విభూతికి ఎంతో మహిమ ఉంటుందని.. మన భారతీయ పురాణాలు పేర్కొంటున్నాయి. పవిత్రతను కలిగిస్తుందని, అరిష్టాలన్నింటిని తొలగించి సకల శుభాలను కలిగిస్తుందని చెబుతున్నాయని.. విభూతిధారణ వలన సమస్త సంపదలు చేకూరుతాయని పేర్కొంటున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..