బాబోయ్‌.. పగబట్టిన తోడేళ్లు ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నాయా..? కారణం ఇదేనట..!

రెండు తోడేలు పిల్లలు చనిపోయిన నాటి నుంచీ అంటే గత ఆరు నెలలుగా తోడేళ్లు మనుషుల మీద పగబట్టాయి. బహ్రైచ్ గ్రామస్తుల మీద వరుస దాడులు చేస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. గత ఆరు నెలలుగా తోడేళ్లు తమ ప్రతీకార దాడులతో 10 మందిని చంపేశాయి. ఇంకా చాలా మందిని తీవ్రంగా గాయపరిచాయి.

బాబోయ్‌.. పగబట్టిన తోడేళ్లు ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నాయా..? కారణం ఇదేనట..!
Wolf Attack
Follow us

|

Updated on: Sep 09, 2024 | 7:51 PM

పాము పగ బడుతుంది అంటారు..అయితే, అలాంటిదే మరేదైనా ఇతర జంతువు కూడా పగ తీర్చుకుంటుందా..? అంటే ఇటీవలి కాలంలో హింసాత్మకంగా మారుతున్న తోడేళ్ల కథ ఈ దిశగానే సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ పరిసర ప్రాంతాల్లో తోడేలు భీభత్సం సృష్టించింది. ఈ క్రూర జంతువు 9 మంది పిల్లలతో సహా 10 మందిని చంపింది. తోడేలు దాడి నేపథ్యంలో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చిన్నారులను రక్షించేందుకు గ్రామస్తులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బహ్రైచ్‌లోని మహసీ తహసీల్ ప్రజలు ఇప్పటికీ రాత్రిపూట మేల్కొని వీధుల్లో గస్తీ కాస్తున్నారు. తమ ఇళ్లలో పిల్లలను కాపాడుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు.

తోడేలు తన పిల్లల పట్ల ఎంతో సానుకూలంగా ఉంటుంది. ఇవి కూడా మనుషుల్లాగే సామూహికంగా జీవనం సాగిస్తాయి. వాటి మధ్య మనుషులకున్నట్టుగానే ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. తోడేలు పిల్లలకు హాని చేసే వారి పట్ల హింసాత్మకంగా మారుతుందని అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. యూపిలోని బహ్రైచ్‌లో జరుగుతున్న వరుస దాడులు ఇందుకు నిదర్శం అంటున్నారు. రెండు దశాబ్దాల క్రితం కూడా ప్రతాప్‌గఢ్-జౌన్‌పూర్ ప్రాంతాల్లో తోడేళ్లు 50 మందికి పైగా చంపేశాయి. అప్పట్లో మగ-ఆడ తోడేలు భీభత్సం సృష్టించింది. అటవీశాఖ అధికారులు విచారణ చేయగా.. మగ, ఆడ తోడేలు మనుషులపై దాడి చేస్తున్నట్టు గుర్తించారు. తోడేలు పిల్లలపై దాడి చేయడాన్ని సహించదు. అప్పుడు తోడేలు తన పిల్లలకు హాని చేసినందున మనుషులపై దాడి చేసిందని చెబుతున్నారు.

అయితే, ఇటీవలి కాలంలో తోడేళ్ల గుంపులోని ఓ రెండు పిల్ల తోడేళ్లు ప్రమాదవశాత్తు ఒక ట్రాక్టర్ ఢీకొట్టడంతో చనిపోయాయని తెలిసింది. ఆ సంఘటన జరిగి ఆరు నెలలు దాటింది. సరిగ్గా ప్రమాదంలో రెండు తోడేలు పిల్లలు చనిపోయిన నాటి నుంచీ అంటే గత ఆరు నెలలుగా తోడేళ్లు మనుషుల మీద పగబట్టాయి. బహ్రైచ్ గ్రామస్తుల మీద వరుస దాడులు చేస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. గత ఆరు నెలలుగా తోడేళ్లు తమ ప్రతీకార దాడులతో 10 మందిని చంపేశాయి. ఇంకా చాలా మందిని తీవ్రంగా గాయపరిచాయి.

ఇవి కూడా చదవండి

తోడేలు వరుస దాడులతో అటవీశాఖ అప్రమత్తమైంది. గ్రామాన్ని తోడేళ్ల బెడద నుంచి విముక్తి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇదిలా ఉంటే,  బహ్రైచ్ గ్రామంపై దాడులు చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్న తోడేళ్ల గుంపును కాల్చి చంపేందుకు యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..