కోల్‌కత ట్రైనీ డాక్టర్‌ పై జరిగింది గ్యాంగ్ రే***ప్‌ కాదా ??

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. లభ్యమైన సాక్ష్యాధారాలన్నీ సంజయ్ రాయ్‌ ఒక్కడే నిందితుడని సూచిస్తున్నాయంటూ సీబీఐ వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది.

కోల్‌కత ట్రైనీ డాక్టర్‌ పై జరిగింది గ్యాంగ్ రే***ప్‌ కాదా ??

|

Updated on: Sep 09, 2024 | 7:35 PM

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. లభ్యమైన సాక్ష్యాధారాలన్నీ సంజయ్ రాయ్‌ ఒక్కడే నిందితుడని సూచిస్తున్నాయంటూ సీబీఐ వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది. విచారణ చివరి దశలో ఉందని, త్వరలోనే ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేయనున్నట్టు సీబీఐ తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌ నిపుణుల పరిశీలన కోసం నిందితుడి డీఎన్ఏతో కూడిన మెడికల్ రిపోర్టులను పంపించింది. అక్కడి వైద్యుల తుది అభిప్రాయం అందిన తర్వాత ఈ కేసు దర్యాప్తును ముగించాలని సీబీఐ భావిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ చీఫ్ డాక్టర్ సందీప్ ఘోష్‌తో సహా వంద మంది వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. 10 మందికి పాలిగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహించింది. ఇవన్నీ చేసిన తర్వాతే ఈ నేరంలో ఇతరుల ప్రమేయం లేదని నిర్ణయానికి వచ్చినట్టు ఆయా వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా

ఈ దొంగ.. వినాయక చవితి రోజే గణేశుడి లడ్డూ కొట్టేశాడు !!

కిస్మిస్‌ గణపతి.. బాదం గణపతి.. ఆకట్టుకుంటున్న గణనాధులు

7 కోట్ల ఏళ్ల క్రితం అంబర్‌ శిలాజం !! ఇంటి మెట్టుగా వాడుకున్న బామ్మ !!

Follow us