7 కోట్ల ఏళ్ల క్రితం అంబర్‌ శిలాజం !! ఇంటి మెట్టుగా వాడుకున్న బామ్మ !!

ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబర్లలో ఒక దానిని చాలా విచిత్ర పరిస్థితుల్లో గుర్తించారు. రొమేనియాలోని కోల్టి అనే గ్రామంలో ఓ బామ్మకి నదిలో ఎర్రటి రాయి ఒకటి దొరికింది. దానిని తీసుకొచ్చి తన ఇంటి వాకిట్లో మెట్టు కింద వాడటం మొదలుపెట్టింది. అది ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్‌ అని ఎవరూ గుర్తించలేదు. ఒకసారి ఆ ఇంట్లో దొంగలు పడి నగలు దోచుకెళ్లారు.

7 కోట్ల ఏళ్ల క్రితం అంబర్‌ శిలాజం !! ఇంటి మెట్టుగా వాడుకున్న బామ్మ !!

|

Updated on: Sep 09, 2024 | 6:25 PM

ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబర్లలో ఒక దానిని చాలా విచిత్ర పరిస్థితుల్లో గుర్తించారు. రొమేనియాలోని కోల్టి అనే గ్రామంలో ఓ బామ్మకి నదిలో ఎర్రటి రాయి ఒకటి దొరికింది. దానిని తీసుకొచ్చి తన ఇంటి వాకిట్లో మెట్టు కింద వాడటం మొదలుపెట్టింది. అది ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్‌ అని ఎవరూ గుర్తించలేదు. ఒకసారి ఆ ఇంట్లో దొంగలు పడి నగలు దోచుకెళ్లారు. వారికి కూడా ఈ రాయి అంబర్‌ అని తెలియలేదు. 1989లో ఆ దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం పతనమైన రెండేళ్లకు ఆ బామ్మ కన్నుమూశారు. తర్వాత ఆమె వారసుడు కూడా దీనిని సాధారణ రాయిగానే చూశాడు. కానీ, కొన్నాళ్లకు అనుమానం వచ్చి చూడగా.. ఏదో విలువైనదిగానే అనిపించింది. దీంతో దానిని రొమేనియా ప్రభుత్వానికే విక్రయించాడు. దీని బరువు సుమారు 3.5 కిలోలు ఉంటుంది. ఆ దేశ ప్రభుత్వం పొలాండ్‌కు చెందిన నిపుణులకు ఈ రాయిని అప్పగించగా.. దానిని వెంటనే వారు అంబర్‌గా గుర్తించారు. దీని వయస్సు 7 కోట్ల సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మార్కెట్‌ విలువ దాదాపు రూ.9 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. ఈ విషయాన్ని రొమేనియాలోని మ్యూజియం ఆఫ్‌ బుజావ్‌ వారు ఓ పత్రికకు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రెండ్ అవ్వాలని పాముతో సెల్ఫీలా ??

Thangalaan: గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి విక్రమ్ తంగలాన్

ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి.. సుమలత షాకింగ్ కామెంట్స్

Mr Bachchan: ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

డెలివరీ డేట్‌కు ముందు.. వినాయకుడి దీవెనలందుకున్న స్టార్ కపుల్

Follow us