డెలివరీ డేట్‌కు ముందు.. వినాయకుడి దీవెనలందుకున్న స్టార్ కపుల్

దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్యలను మండపాల్లో కూర్చోబెట్టి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్‌ దంపతులు ముంబైలోని ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని దర్శించుకున్నారు. ఆ తరువాత ఎరుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకున్నారు.

డెలివరీ డేట్‌కు ముందు.. వినాయకుడి దీవెనలందుకున్న స్టార్ కపుల్

|

Updated on: Sep 08, 2024 | 4:26 PM

దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్యలను మండపాల్లో కూర్చోబెట్టి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్‌ దంపతులు ముంబైలోని ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని దర్శించుకున్నారు. ఆ తరువాత ఎరుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే దీపిక – రణ్‌వీర్ మరికొన్ని రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు.ప్రస్తుతం దీపిక నిండు గర్భంతో ఉన్నారు. ఈ నెలలోనే ఆమెకు డెలివరీ డేట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగానే వినాయకుడి దీవెనలు అందుకున్నారీ లవ్లీ కపుల్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Fish Venkat: ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా..

Raj Tarun: మాల్వీ ఫ్లాట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రాజ్‌తరుణ్..

TOP 9 ET News: మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్.. ఉస్తాద్‌లో కీలక మార్పులు

Follow us